- Advertisement -
జగిత్యాల నియోజకవర్గ పాస్టర్స్ కమిటీ అధ్యక్షులుగా సెల్వాన్
Selvan as the president of Jagityala Constituency Pastors Committeeజగిత్యాల,
: జగిత్యాల నియోజకవర్గ పాస్టర్స్ ,ఇవాంజలిస్టుల వెల్ఫేర్ అసోసియేషన్ నూతన కార్యవర్గాన్నీ సభ్యులు ఎనుకున్నారు.
మంగళవారం జగిత్యాల సిఎస్ఐ కమ్యూనిటీ హల్ లో ఓటింగ్ నిర్వహించి ఎన్నుకున్నట్లు పాస్టర్ తిమోతి జయరాజు తెలిపారు.
అసోసియేషన్ కి చైర్మన్ గా డాక్టర్ జివరత్నం వ్యవహరిస్తారని ఆయన తెలిపారు.జగిత్యాల నియోజకవర్గం అసోసియేషన్ కమిటీ అధ్యక్షుడిగా సెల్వాన్,ప్రధాన కార్యదర్శిగా కాళేబు,ఉపాధ్యక్షులుగా జోసెఫ్,జయింట్ సెక్రటరీ రాకేష్, కోశాధికారిగా సంతోష్,ఆర్గనైజింగ్ సెక్రటరీ సమూయేలు,కమిటీ సభ్యులు అబ్రాహాము, హానోకు, పౌలు,జొనా,రాజ్ కుమార్ లు ఎన్నికయ్యారు.. చీఫ్ అడ్వైజర్స్ గా మోషే,సంజీవ్,స్వామిలు ఎన్నికైనట్లు తెలిపారు.నూతనంగా ఎన్నికైన నాయకులకు
అసోసియేషన్ నాయకులు అభినందించారు.ఈ కార్యక్రమంలో నియోజక వర్గంలోనీ జగిత్యాల అర్బన్,రూరల్, బీర్పూర్,సారంగాపూర్,రాయికల్ పాస్టర్స్, ఇవాంజలిస్టులు పాల్గొన్నారు.
- Advertisement -




