గుంటూరు సిపిఐ కార్యాలయంలో ఏకపాత్రాభినయ పోటీలు
One Act Competitions at Guntur CPI Officeప్రజానాట్యమండలి గుంటూరు జిల్లా కార్యదర్శి ఆరేటి రామారావు
పొన్నూరు,
: భారత కమ్యునిస్టు పార్టీ భారత దేశం లో 1925సం. డిసెంబరు 26న స్థాపించడం జరిగింది అని,2024సం. డిసెంబరు 26వ తేదీకి నూరు సంవత్సరాలవుతున్నసందర్భముగా ఆంధ్ర ప్రదేశ్ ప్రజా నాట్యమండలి, అభ్యుదయ రచయితల సంఘం, అఖిల భారత యువజన సమాఖ్య, అఖిల భారత విద్యార్థి సమాఖ్య( ఏఐఎస్ఎఫ్) మరియు ఏఐటీయూసీ ఆధ్వర్యములో ఈనెల 8వ తేదీన గుంటూరు క్రొత్త పేట లోని సిపిఐ కార్యాలయంలో ఉదయం 9 గ
పాటలు, ఏ కపాత్రాభినయపోటీలు
నిర్వహించటం జరుగుతుందని ఆంధ్ర ప్రదేశ్ ప్రజా నాట్యమండలి గుంటూరు జిల్లా కార్యదర్శి అరే టి రామారావు అన్నారు. కళ లు మరియు సాహిత్యం పట్ల అభిరుచి కలిగిన యువతను ప్రోత్సహించేందుకు నిర్వహించే ఈ
పోటీల్లో పాల్గొన్న వలసినదిగా యువ కళా కారులను కోరారు. పాటలు, మరియు ఏ కపాత్రాభి నయము లో ప్రథమ బహుమతి
రు/3000 లు, ద్వితీయ బహుమతి రు/2000.లు తృతీయ
బహుమతి రూ1000/లు గా నిర్ణయించటం జరిగింది అని అన్నారు. ఈ పోటీలలో గెలుపొందిన వారు డిసెంబరు 16,17 తేదీలలో విజయవాడలో
జరిగే రాష్ట్ర స్థాయి పోతీలలోపాల్గొను టకు ఎంపిక చేయటం జరుగుతుందని అన్నారు
ఉ మ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా జరిగే ఈ పోటీలలో ఉత్సాహవంతులైనకళాకారులు
పాల్గొనాల్సిందిగా కోరారు.ఈకార్యక్రమంలో గేయరచయి త దేవరకొండ శ్రీనివాస్
గాయకులు ఘంటా. రాజేంద్ర కుమార్, కిషోర్ తదితరులు పాల్గొన్నారు.




