- Advertisement -
డిసెంబర్ 8 వరకు పర్యావరణ పరిరక్షణ వారోత్సవాలు
Environment Protection Week till 8th Decemberమహబూబాబాద్,
మంగళవారం ఐ.డి.ఓ.సి లోని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయం లో జిల్లా వైద్యాధికారి డాక్టర్ జి మురళీధర్ ఆధ్వర్యంలో పర్యావరణ పరిరక్షణ వారోత్సవాల సందర్భంగా ప్రతిజ్ఞ సిబ్బందితో చేస్తూ, ఇంటి వద్ద గాని లేదా ఆఫీస్ వద్ద ఒక గదిని విడిచే టప్పుడు నేను అన్ని విద్యుత్ పరికరాలను ఆఫ్ చేస్తానని, నేను ఎక్కువగా ఖాళీ నడకన సైకిల్పై లేదా ప్రజా రవాణా బస్సులలోనే ప్రయాణిస్తానని, నీటిని వృధా చేయకుండా ఉంటానని, నేను నల్ల కుళాయిలను ఉపయోగించిన తర్వాత బందు చేస్తానని , నా వాహనాన్ని కడగడానికి బదులుగా తూడ్చు కోవడానికి , ఇష్టపడతానని చెత్త డబ్బాలో తప్ప మరెక్కడా చెత్తను వేయనని, నేను ఆహారాన్ని వృధా చేయకుండా ఉంటానని, స్థానిక ఆహార పదార్థాలను తింటూ ప్యాకేజ్ ఫుల్ వీలైనంత తక్కువగా తీసుకుంటానని, షాపింగ్ చేసేటప్పుడు నేను ఎల్లప్పుడూ బట్టల సంచి క్లాత్ బ్యాగ్ ను తీసుకు వెళ్తానని, ప్లాస్టిక్ సంచులను ఉపయోగించ నని, మొక్కలను నాటి చెట్లను సంరక్షిస్తానని, ఈ పద్ధతులన్నీ నా చుట్టు పక్కల వారికి నేర్పుతానని, ప్రతిజ్ఞ చేయించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ నాగేశ్వరరావు, డాక్టర్ సారంగం డాక్టర్ లక్ష్మీ నారాయణ, కె.వి.రాజు హెల్త్ ఎడ్యుకేటర్, హెచ్ ఈ ఓ రామకృష్ణ, గీతా, శారద, డిపిహెచ్ఎన్ఓ మంగమ్మ, డి డి ఎం సోమిత్,రాజ్ కుమార్, కంప్యూటర్ అరుణ్, నీలిమ శ్వేత, సూపరిండెంట్ వాణి, జూనియర్ అసిస్టెంట్లు, సీనియర్ అసిస్టెంట్లు, డిపిఎం నీలోహన ఆఫీస్ సిబ్బంది పాల్గొన్నారు.
- Advertisement -




