పీఏ పల్లి స్కూలు విద్యార్దినిలకు అస్వస్థత

- Advertisement -

పీఏ పల్లి స్కూలు విద్యార్దినిలకు అస్వస్థత

Illness for the students of PA Palli School

ఫుడ్ పాయిజన్ కాదని కలెక్టర్ వివరణ
నల్గోండ
నల్లగొండ జిల్లా పరిధిలోని పీఏ పల్లి మోడల్ స్కూల్లో.. విద్యార్థులు ఫుడ్ పాయిజనింగ్ కు గురికాలేదని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి స్పష్టం చేశారు. నలుగురు విద్యార్థులు అస్వస్థతకు గురి కాగా.. వారిని దేవరకొండ ఏరియా ఆసుపత్రికి తరలించారని తెలుసుకుని హుటాహుటిన ఆమే నల్లగొండ నుంచి  దేవరకొండ వెళ్లి ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులను పరామర్శించారు. అస్వస్థతకు గల కారణాలను ఆమె విద్యార్థులతో ప్రత్యక్షంగా మాట్లాడి తెలుసుకున్నారు. పీఏ పల్లి మోడల్ స్కూల్ కు చెందిన నలుగురు విద్యార్థినిలు కడుపునొప్పి కారణంగా అస్వస్థతకు గురి అయ్యారని.., తక్షణమే వారిని  దేవరకొండ ఏరియా ఆసుపత్రికి తీసుకురావడం జరిగిందన్నారు. అక్కడ డాక్టర్లు.. విద్యార్థినిలకు అన్ని పరీక్షలు నిర్వహించి.. వారికి చికిత్స అందించడం జరుగుతున్నదన్నారు. ప్రస్తుతం వారి ఆరోగ్యం నిలకడగా ఉందని.., వారి ఆరోగ్యానికి ఎలాంటి ప్రమాదం లేదని.., ముఖ్యంగా విద్యార్థినిలు  ఎలాంటి ఫుడ్ పాయిజన్ కు గురి కాలేదని స్పష్టం చేశారు. గడచిన 3 రోజుల నుండి సదరు విద్యార్థులు సరైన ఆహారం తీసుకొక పోవడంవల్ల  నిరసించిపోయి డిహైడ్రేషన్ కు గురయ్యారని తెలిపారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular