- Advertisement -
ఎల్బీనగర్ జిహెచ్ఎంసి సర్కిల్ కార్యాలయం వద్ద ఉద్యోగుల ఆందోళన
Employee agitation at GHMC circle office, LBnagarహైదరాబాద్
ఎల్బీనగర్ జిహెచ్ఎంసి సర్కిల్ 4 డీసీ ఇస్లావత్ సేవా నాయక్ ను తొలగించాలని,ఎల్బీనగర్ జిహెచ్ఎంసి సర్కిల్ కార్యాలయం వద్ద ఉద్యోగుల ఆందోళన చేపట్టారు.
ఎల్బీనగర్ జిహెచ్ఎంసి సర్కిల్ 4 డీసీ ఇస్లావత్ సేవనాయక్ టాక్స్ ఇన్స్పెక్టర్లను,ఉద్యోగుల ను ఉదయం ఆరు గంటలకే విధుల్లో ఉండాలని ఒత్తిడి చేయడం వల్ల ప్రమాదాలకు గురవుతున్నారని బీ ఎం ఈ యూ ఆధ్వర్యంలో ఆందోళన కు దిగారు.
టాక్స్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ రాజు పై సస్పెండ్ చేస్తా, ఛార్జ్ మెమో ఇస్తానంటూ బెదిరింపులు చేయడం వల్ల పని ఒత్తిడితో సోమవారం రోజు ఉదయం ఎల్బీనగర్ ఫ్లై ఓవర్ పై బైక్ మీద నుంచి పడి తీవ్ర గాయాల పాలయ్యాడని ఆరోపించారు.10 గంటలకు ఉద్యోగం కు రావాల్సిన వాళ్ళను 6,7 గంటలకు రావాలని మెసేజ్ లు పెట్టడం, మహిళా ఉద్యోగుల ను సాయంత్రం 8 గంటల వరకు విధుల్లోనే ఉంచుతున్నారని ఆరోపించారు. ఉద్యోగులను వేధింపులకు గురిచేస్తున్నా సర్కిల్ 4డిప్యూటీ కమిషనర్ ఇస్లావత్ సేవా నాయక్ ను సస్పెండ్ చేయాలని ఛాంబర్ వద్ద ఆందోళన చేపట్టారు.
- Advertisement -




