పీసి అండ్ పీ ఎన్ ఢీ టీ చట్టాన్ని పట్టిష్టంగా అమలు చేయాలి.
The PC&PNDH Act should be strictly enforced.జయశంకర్ భూపాలపల్లి,
పిసి అండ్ పిఎన్డిటి చట్టం పటిష్టంగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ అధికారులను ఆదేశించారు.
బుధవారం ఐడిఓసి కార్యాలయంలో వైద్య, పోలీస్, స్వచ్చంద సంస్థల తో పిసి అండ్ పిఎన్డిటి, మాతా శిశు మరణాలు తదితర అంశాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అజాంనగర్, కాళేశ్వరం, చిట్యాల, మహా ముత్తారంలలో లింగ నిష్పత్తి తక్కువగా ఉన్నదని, ఆ ప్రాంతాల్లో నిరంతర తనిఖీలు మిర్వహించాలని సూచించారు. అంగన్ వాడి సిబ్బంది, స్వచ్చంద సంస్థలు టీముల ఏర్పాటు ద్వారా నిరంతరం తనిఖీలు చేపట్టాలని తెలిపారు. లింగ నిర్దారణ పరీక్షలు చేసే కేంద్రాలపై కేసులు నమోదు చేయాలని ఆదేశించారు. తొలికాన్పు లో అమ్మాయి జన్మించడం వల్ల రెండో కాన్పులో మళ్ళీ అమ్మాయి పుడుతుందని గర్భ విచ్చిత్త చేస్తున్నారని, తొలి కాన్పులో అమ్మాయి పుట్టిన కుటుంబాలను గుర్తించి అవగహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. ప్రతి గురువారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో అమ్మ కోసం కార్యక్రమం చేపట్టామని, జీరో నుండి సంవత్సరం వరకు ఆరోగ్య సంరక్షణపై తల్లి, పిల్లలపై ప్రత్యేక ఫోకస్ పెట్టాలని సూచించారు. భూపాలపల్లిలో 3, కాటారంలో 3, వెలిశాలలో 1 మాతృ మరణం పట్ల సమీక్ష చేశారు. గర్భం నిర్దారణ జరిగిన నాటి నుండి ఆశా నుండి వైద్యాధికారి వరకు నిరంతర పర్యవేక్షణ చేయాలని తెలిపారు. సిటీ స్కానింగ్ కేంద్రాలపై నిరంతరం తనిఖీలు చేయాలని సూచించారు. ఈ సమావేశంలో జిల్లా వైద్యాధికారి డా మధుసూదన్, ఎఎస్పీ కిషన్, ప్రోగ్రాం అధికారులు డా ఉమాదేవి, శ్రీదేవి , మారి స్వచ్చంద సంస్థ అధ్యక్షులు సదానందం తదితరులు పాల్గొన్నారు.




