వీరారెడ్డిపల్లె  పాల సొసైటీ ఎన్నికల్లో  విజయ డంక మోగించిన టిడిపి

- Advertisement -

వీరారెడ్డిపల్లె  పాల సొసైటీ ఎన్నికల్లో  విజయ డంక మోగించిన టిడిపి

TDP won victory in Veerareddypalle milk society election

శిరివెళ్ల :
మండల పరిధిలోని వీరారెడ్డి పల్లె గ్రామపంచాయతీలో బుధవారం జరిగిన పాల సొసైటీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయ డంకా మోగించింది విజయ పాల డైరీ జిల్లా ప్రతినిధులు ఇతర ప్రముఖుల ఆధ్వర్యంలో పటిష్ట బందోబస్తు మధ్య జరిగిన పాల సొసైటీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ సునాయాసంగా విజయం సాధించి తమ అభ్యర్థులను విజయ పతాన నిలుపుకున్నది. వీరారెడ్డిపల్లి గ్రామపంచాయతీలో ఉన్న పాల డైరీ సొసైటీ సుదీర్ఘకాలంగా పాడి పరిశ్రమ అభివృద్ధికి ఎంతగానో కృషి చేసింది ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకులు కొండమడుగుల శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన పాల సొసైటీ ఎన్నికల్లో టిడిపి విజయకేతనం ఎగురవేయడం పట్ల తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఆనందోత్సవాలు జరుపుకున్నారు ఈ సందర్భంగా ఆళ్లగడ్డ శాసన సభ్యురాలు భూమా అఖిలప్రియ,  భార్గవ్ రామ్,  భూమ జగత్ విఖ్యాత రెడ్డి కి శిరివెళ్ల మండల టిడిపి కన్వీనర్ కాటంరెడ్డి శ్రీకాంత్ రెడ్డి  ఆదేశాల మేరకు కొండమడుగుల శ్రీనివాసరెడ్డి పాల సొసైటీ ఎన్నికల్లో కీలక పాత్ర పోషించి తమ అభ్యర్థులను గెలిపించుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారికి భూమా అభిమానులకు కాటంరెడ్డి శ్రీకాంత్ రెడ్డి కి పాల సొసైటీ సభ్యులకు సహకరించిన ప్రతి ఒక్కరికి కొండమడుగుల ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. శిరివెళ్ల సర్కిల్ ఇన్స్పెక్టర్ వంశీధర్ ఎస్సై చిన్న పీరయ్య యాదవ్ తన పోలీసు సిబ్బందితో ప్రత్యేక బందోబస్తును నిర్వహించారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular