ఈనెల 9, 10 తేదీలలో సిపిఐ నిరసన కార్యక్రమాలు
CPI protest programs on 9th and 10th of this monthసిపిఐ పార్టీ నాయకులు పిలుపు
దాచేపల్లి,
భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) దాచేపల్లి మండల శాఖ ఆధ్వర్యంలో నారాయణపురం లోని పార్టీ కార్యాలయం సముదాయం లో ఉన్న ఎస్టీయూ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలపై ఈ నెల 9, 10న నిరసన కార్యక్రమాలు, విద్యుత్ చార్జీల పెంపు పై ఆందోళన చేయాలని తీర్మానించారు. అదేవిధంగా ఈ నెల 26న వందేళ్ళు పూర్తి చేసుకున్న పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను కూడా ఘనంగా జరుపుకోవాలని నిర్ణయించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ పల్నాడు జిల్లా సహాయ కార్యదర్శి షేక్ హుస్సేన్, దాచేపల్లి మండల శాఖ సెక్రెటరీ, ఏఐటీయూసీ పల్నాడు జిల్లా అధ్యక్షుడు కొమెర వెంకట్రావు, ఏఐటీయూసీ గురజాల నియోజకవర్గ అద్యక్షుడు వేముల వెంకటరెడ్డి , సీనియర్ నాయకులు బుర్రి కృష్ణారెడ్డి, తెలనాకుల సత్యనారాయణతో పాటు శాంతి, పత్తిపాటి వెంకట నాగరాజు, షేక్ గాలీసా, ఎడ్ల భాస్కర్, గంగారం మీరావలీ, రామయ్య తదితరులు పాల్గొన్నారు.




