మేడారంలో ఏం జరుగుతోంది…

- Advertisement -

మేడారంలో ఏం జరుగుతోంది…

What is happening in Medaram...

వరుస సంఘటనలతో భయం..భయం
వరంగల్, డిసెంబర్ 5, (వాయిస్ టుడే)
రుసగా పూజారులు చనిపోయారు. నెలల వ్యవధిలోనే ప్రాణాలు విడిచారు. దాన్ని మర్చిపోకముందే హోరుమంటూ సుడిగాలి వచ్చింది. వేలాది వృక్షాలను నేలమట్టం చేసింది. ఇది జరిగిన కొద్ది రోజులకే భూకంపం వచ్చింది. వీటన్నింటికీ మేడారం, దాని చుట్టుపక్కల ప్రాంతాలు కేంద్రం కావడం కలకలం రేపుతోంది. చూస్తుంటే ప్రకృతి ఏదో మనకు చెప్పాలని చూస్తోంది.ఒక ఘటన జరిగితే ఈ యాదృచ్చికమంటాం.. మరోసారి జరిగితే దురదృష్టం అంటాం. ఇంకోసారి జరిగితే దారుణం అంటాం. ఇప్పుడు మేడారం విషయంలోనూ అదే జరుగుతోంది.. దట్టమైన అడవికి కేంద్రంగా.. సమ్మక్క సారలమ్మ కు విడిదిగా మేడారం ఉంది. ఈ మేడారం లో రెండు సంవత్సరాలకు ఒకసారి ఫిబ్రవరి నెలలో జాతర జరుగుతుంది.. ఇది ఆసియా ఖండంలోనే అత్యంత పెద్దదైన గిరిజన జాతర. ఈ జాతరకు లక్షలాదిమంది భక్తులు వస్తుంటారు. దీనిని తెలంగాణ కుంభమేళాగా పేర్కొంటారు. అటువంటి ఈ ప్రాంతంలో మేడారం జాతరను గిరిజన పూజారులు దగ్గరుండి నిర్వహిస్తారు. వారి పూజా విధానం కూడా భిన్నంగా ఉంటుంది. అయితే మేడారం సమ్మక్క సారలమ్మ జాతరలో పూజలు నిర్వహించే పూజారులు ఇటీవల చనిపోయారు. నెలల వ్యవధిలోనే అనారోగ్యానికి గురై కన్నుమూశారు. పూజారులు ఇలా చనిపోవడం మిగతా వారికి సహజ ప్రక్రియ లాగా కనిపించినప్పటికీ.. ఆ చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలకు మాత్రం ఏదో కీడు లాగా అనిపించింది. ఈ ఘటన జరిగిన కొద్ది రోజులకే ఇటీవల బీభత్సమైన గాలి ఆ ప్రాంతంలో వచ్చింది. మేడారం చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న అడవిని నేలమట్టం చేసింది. వేలాది వృక్షాలు నేలకూలాయి. ఈ ఘటన జరిగే ఒకరోజు ముందు అక్కడ ఉండే కోతులు, దుప్పులు, ఇతర అటవీ జంతులు కేకలు వేసుకుంటూ భయపడి దూరంగా వెళ్లిపోయాయి. అవి వెళ్లిపోయిన మరుసటి రోజు అక్కడ చండ ప్రచండమైన వేగంతో గాలులు వీచాయి. వేలాది వృక్షాలు నేలకొరిగాయి. వీటిని ప్రకృతిలో జరిగే మార్పు అని శాస్త్రవేత్తలు కొట్టి పారేసినప్పటికీ.. ఏదో జరుగుతోందనే భయం మాత్రం ఇక్కడి ప్రజల్లో ఉంది.ఇక బుధవారం తెలుగు రాష్ట్రాలలో నమోదైన స్వల్ప భూకంపం మేడారం కేంద్రం గానే మొదలైంది. బుధవారం ఉదయం మేడారం గద్దె స్వల్పంగా ఊగింది. ఉదయమే అమ్మ వార్లకు పూజలు చేయడానికి ఓ మహిళ అక్కడికి వచ్చింది. ఆమె అక్కడికి చేరుకోగానే కొంత సమయం తర్వాత గద్దెలు ఊగినట్టు కనిపించింది. ఆమెలో ఆందోళన మొదలైంది. ఆ తర్వాత ఈ విషయాన్ని బయటికి వచ్చి చుట్టుపక్కల ఉన్న వాళ్లకు చెప్పింది. ఆ తర్వాత వరంగల్, కరీంనగర్, నల్లగొండ, ఖమ్మం జిల్లాల్లో భూమి స్వల్పంగా కంపించింది. అయితే ఈ సంఘటనలు మొత్తం మేడారం, దాని చుట్టుపక్కల ప్రాంతాల కేంద్రంగా జరగడం అనేక అనుమానాలకు తావిస్తోంది. “మొన్న పూజారులు చనిపోయారు. నిన్న భారీగా చెట్లు కూలిపోయాయి. ఇవాళ భూకంపం వచ్చింది. చూస్తుంటే ఏదో జరుగుతోంది.. పెనువిపత్తు సంభవిస్తుందా? ప్రకృతి ఏమైనా చెప్పాలి అనుకుంటున్నదా? వీటన్నింటికీ మేడారం, దాని చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలు కేంద్రాలు కావడం ఆందోళన కలిగిస్తున్నది. ఇటీవల జరిగిన జాతరలో అమ్మవార్లకు ఏమైనా తక్కువ జరిగిందా? జాతర నిర్వహణలో ఏదైనా అపచారం చోటు చేసుకుందా?” అనే అనుమానాలు మేడారం వాసుల్లో వ్యక్తమవుతున్నాయి. మరోవైపు ఇవన్నీ ప్రకృతిలో సంభవించే మార్పులేనని, వీటికి విపరీతార్థాలు తీయొద్దని శాస్త్రవేత్తలు అంటున్నారు. మూఢనమ్మకాలను వ్యాప్తి చేయొద్దని సూచిస్తున్నారు.
భయం..భయం
మేడారం కేంద్రంగా భూ ప్రకంపనలు చోటు చేసుకోవడం సంచలనం కలిగిస్తోంది. భూ ప్రకంపనల వల్ల పెద్దగా నష్టం చోటు చేసుకోకపోయినప్పటికీ శాస్త్రవేత్తలు అధ్యయనంలో సరికొత్త విషయాలు వెలుగుచూస్తున్నాయి.. భూమికి ఐదు నుంచి 40 కిలోమీటర్ల లోతులో తక్కువ వ్యవధిలో భూ ప్రకంపనలు రావడంతో భూకంపం తీవ్రత స్వల్పంగా ఉందట. ఒకవేళ ఇది గనుక భూమికి 10 కిలోమీటర్ల లోతులో గనుక వచ్చి ఉంటే ప్రభావం అత్యంత తీవ్రంగా ఉండేదట. 35 కిలోమీటర్ల లోతులో భూ ప్రకంపనలు చోటు చేసుకోవడంతో ఉపరితలం పైన స్వల్పంగానే ప్రకంపనలు వచ్చాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.తెలంగాణలో మేడారం కేంద్రంగా బుధవారం ఉదయం భూ ప్రకంపనలు చోటు చేసుకోవడం సంచలనం కలిగించింది. అయితే ఇక్కడ మాత్రమే ఎందుకు భూ ప్రకంపనలు వచ్చాయనే ప్రశ్న అందరిలోనూ తలెత్తుతోంది. భూమి అనేది అనేక పొరలతో నిర్మితమై ఉంటుంది. ఈ పొరలు కదిలినప్పుడు మాత్రమే భూ ప్రకంపనలు చోటుచేసుకుంటాయి. జియాలాజికల్ సైంటిస్టుల అభిప్రాయం ప్రకారం భూమి ఉపరితలం కింద ఒక స్థానం ఉంటుంది. దానిని భూకంప కేంద్రం అంటారు. భూకంపం తీవ్రంగా వస్తే.. దాని ప్రభావం చాలా దూరం వరకు ఉంటుంది. ఉదాహరణకు 0.5 నుంచి 5.9 వరకు రిక్టర్ స్కేల్ పై నమోదైతే దానిని జియోలాజికల్ పరిభాషలో స్వల్ప భూకంపం అంటారు.. అప్పుడు భూమి కంపించిన తీరుకు ఇంట్లో ఉన్న ఫర్నిచర్ కింద పడిపోతుంది. ఒకవేళ అది 7 నుంచి 7.9 గా నమోదైతే భవనాలు నిట్ట నిలువునా కూలిపోతాయి. దారుణమైన పరిస్థితులు సంభవిస్తాయి.తెలంగాణ రాష్ట్రంలోని ములుగు జిల్లాలో మేడారం కేంద్రంగా బుధవారం ఏర్పడిన భూకంపం తీవ్రత 05.0 మాత్రమే. ఇది కూడా కొన్ని సెకన్ల వ్యవధిలోనే భూమి కంపించింది. ఈ స్థాయిలో భూకంపం 1969 లో ప్రసిద్ధ రామక్షేత్రం భద్రాచలంలో చోటుచేసుకుంది. ఇన్ని సంవత్సరాల అనంతరం భూకంపం రావడం ఇదే తొలిసారి.. అయితే మేడారం కేంద్రంగా భూకంపం రావడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. నది ప్రవహించే చోట భూ ప్రకంపనలు వస్తాయి. ఎందుకంటే నది ప్రవాహం దాటికి భూమి లోపల పగులు ఏర్పడుతుంటాయట. అందువల్ల లోపలి పొరల్లో సర్దుబాటు జరుగుతుందట.. మేడారం ప్రాంతంలో భూకంపం రావడానికి కారణం ఇదేనని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అయితే నదీ పరివాహక ప్రాంతాలు, బొగ్గు గనులు ఉండే ప్రాంతాలలో భూకంపం రావడానికి అవకాశం ఉండదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.. అయితే భూపాలపల్లి జిల్లా పరిధిలో బొగ్గు తవ్వకాలు విపరీతంగా జరుగుతున్నాయి. ములుగు లోను మట్టి తవ్వకాలు విస్తారంగా జరుగుతున్నాయి. అందువల్లే భూమి పొరల్లో సర్దుబాట్లు జరుగుతున్నాయి. బుధవారం అలాంటి సర్దుబాట్ల వల్లనే భూకంప తరంగాలు వేగంగా వ్యాపించాయని శాస్త్రవేత్తలు అంటున్నారు.. ఇక భూ ప్రకంపనలను సిస్మోగ్రాఫ్ అనే యంత్రం ద్వారా నమోదు చేస్తారు. దేశంలో నాలుగు సిస్మోక్ జోన్లు ఉన్నాయి. ఇందులో తెలంగాణ జోన్ -2 లో ఉంది. అయితే ఈ ప్రాంతంలో అత్యల్పంగానే భూకంపాలు వస్తాయట

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular