వ్యవసాయం గ్రామీణాభివృద్ధికి రుణ పరిమితి పెంపు

- Advertisement -

వ్యవసాయం గ్రామీణాభివృద్ధికి రుణ పరిమితి పెంపు

Increase in loan limit for agriculture rural development

నాలెడ్జ్ ఎకానమీకి నాబార్డు సంపూర్ణ సహకారం

రాజధానిలో నాబార్డు ఐకానిక్ భవనాన్ని యేడాదిన్నరలో పూర్తి

నాబార్డు ఛైర్మన్ షాజీ కృష్ణన్ ప్రకటన

సీఎం చంద్రబాబుతో నాబార్డు ఛైర్మన్ భేటీ

అమరావతి,
: రాష్ట్రంలో వ్యవసాయం, గ్రామీనాభివృద్ధికి మరింత రుణం అందించేందుకు సహకారం అందిస్తామని నాబార్డు ఛైర్మన్ షాజీ కృష్ణన్ జీ హామీ ఇచ్చారు. గ్రామీణ ప్రాంతాలను నాలెడ్జ్ ఎకానమీలో మరింత మెరుగు పరిచేందుకు పూర్తి మద్ధతిస్తామని అన్నారు. ఉండవల్లి నివాసంలో సీఎం చంద్రబాబుతో నాబార్డు ఛైర్మన్ షాజీ కృష్ణన్ జీ  సమావేశమయ్యారు. వ్యవసాయం, గ్రామీనాభినాభివృద్ధి, సూక్ష్మ, మధ్య తరహా పరిశ్రమలకు సహకారం, మత్య్సరంగం అభివృద్ధి వంటి అంశాలపై చర్చించారు. స్వయం సహాయక బృందాలు, ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్, పారిశ్రామిక వేత్తలుగా మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు నాబార్డు మద్ధతుగా నిలుస్తుందని షాజీ కృష్ణన్ జీ ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. రూరల్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ డెవలెప్మెంట్ ఫండ్ కింద పీపీపీ విధానంలో రాష్ట్రవాటాగా వయబిలిటీ గ్యాప్ నిధులను ప్రభుత్వం సమకూర్చుతుందని సీఎం అన్నారు. ఏపీకి ఆర్ఐడీఎఫ్ కింద అందించే అదనపు కేటాయింపులు, సహకార సంఘాలకు రాయితీలు మరింత అందిస్తామని షాజీ కృష్ణన్ జీ పేర్కొన్నారు. రాష్ట్రంలో మత్స్యకార రంగాన్ని అభివృద్ధి చేయడంతో పాటు ఫిషింగ్ హార్బర్‌ల నిర్మాణం కోసం ఎఫ్‌ఐడీఎఫ్ కింద మంజూరైన రూ.450 కోట్లను వినియోగంపైనా సమావేశంలో చర్చ జరిగింది. దేశానికే ఆదర్శవంతంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రైమరీ అగ్రికల్చర్ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీని నాబార్జు ఛైర్మన్ అభినందించారు. అంతేకాకుండా అమరావతిలో ఐకానిక్ నాబార్డు భవనాన్ని ఏడాదిన్నరలోనే పూర్తి చేస్తామని నాబార్డు ఛైర్మన్ హామీ ఇచ్చారు. నాబార్డ్ ప్రాంతీయ కార్యాలయాన్ని హైదరాబాద్ నుండి విజయవాడకు మార్చడంపై సీఎం సంతృప్తి వ్యక్తం చేశారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular