- Advertisement -
ప్రభుత్వం తీరుకు నిరసనగా బీఆర్ఎస్ ఆందోళనలు..
BRS agitations in protest against the government's behavior.హైదరాబాద్
బీఆర్ఎస్ నేతల అరెస్టుకు నిరసనగా శుక్రవారం బీఆర్ఎస్ ఆందోళనకు పిలుపిచ్చింది. ఈ నేపధ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. ముందస్తు అరెస్టులు చేస్తున్నారు. పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేల నివాసాల వద్ద
గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద ఇంటి వద్ద ఉద్రిక్తత నెలకొంది. మరోవైపు ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న హుజూరాబాద్ లో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు
చేశారు. హుజూరాబాద్ అంబేద్కర్ చౌరస్తా వద్ద ఏసీపీ శ్రీనివాస్జీ ఆధ్వర్యంలో సీఐ తిరుమల్గౌడ్, సిబ్బంది బీఆర్ఎస్ నాయకులు రోడ్ల మీదకు రాకుండా చర్యలు చేపట్టారు. హుజూరాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ గందె రాధిక,
బండ శ్రీనివాస్, బీఆర్ఎస్ నాయకులు ఎమ్మెల్యే కౌశిక్రెడ్డి అరెస్టును ఖండించారు.
- Advertisement -




