మత్స్యకారుల రాస్తారోకో

- Advertisement -

మత్స్యకారుల రాస్తారోకో

fisherman's Dharna

కాకినాడ
ఫార్మా కంపెనీల నుంచి వచ్చే వ్యర్ధాలను సముద్రం గర్భంలోకి విడిచి పెట్టొద్దని,ఫార్మా కంపెనీల నుండి వ్యర్ధాలను సముద్రంలోకి విడిచిపెడుతున్న పైప్ లైనును తక్షణమే తొలగించాలని డిమాండ్ చేస్తూ కాకినాడజిల్లా పిఠాపురం నియోజకవర్గం యూ.కొత్తపల్లి మండలం కోనపాపాపేటకు చెందిన మత్స్యకారులు ఆందోళనకు దిగారు.
కాకినాడ నుండి అద్దరిపేటకు వెళ్ళే బీచ్ రోడ్డుపై బోటును అడ్డంగా పెట్టి రాస్తారోకో,ధర్నా చేపట్టారు.ఫార్మా కంపెనీల వ్యర్ధాలను సముద్రంలోకి వదిలిపెట్టడం వలన మత్స్యసంపదకు నష్టం వాటిల్లుతోందని,వెంటనే నిలిపివేయాలని మత్స్యకారులు నినాదాలు చేశారు.ఈ విషయం తెలుసుకున్న తెలుగుదేశంపార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి,పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ కోనపాపాపేట గ్రామానికి వచ్చి ఆందోళనకారులతో మాట్లాడారు.అలాగే.,కాకినాడ ఆర్డీఓ మల్లిబాబు,మాజీ ఎమ్మెల్యే వర్మ మత్స్యకారులతో చర్చలు జరిపారు.ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వర్మ,ఆర్డిఓ మల్లిబాబు మీడియాతో మాట్లాడారు..

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular