ఖని టూ మహారాష్ట్ర…

- Advertisement -

ఖని టూ మహారాష్ట్ర…

Khani Two Maharashtra...

 – మూడు పువ్వులు ఆరు కాయలు రేషన్ బిజినెస్…

– బియ్యం కు బదులు లబ్ధిదారులకు డబ్బులు ఇస్తున్న డీలర్లు…

– ఆపై మహారాష్ట్రకు తరలింపు…

గోదావరిఖని:

రామగుండం పారిశ్రామిక  ప్రాంతంలో రేషన్ బియ్యం బిజినెస్ మూడు పూవులు ఆరు కాయలుగా సాగుతోంది. దొరికితే దొంగలు… లేదంటే దొరలు అన్నట్టుగా చాలాకాలంగా రేషన్ బియ్యం మాఫియా యదేచ్చగా నడుస్తోంది. ఇటీవల కాలంగా ఈ రేషన్ మాఫియా మరింత బరితెగించింది. గోదావరిఖని నుండి మహారాష్ట్రకు  రేషన్ బియ్యం బహిరంగంగానే తరలిస్తూ కోట్లకు పడగెత్తుతున్నారు. పౌర సరఫరాల శాఖ ఉన్నతాధికారులు, విజిలెన్స్ అండ్ ఇంఫోర్స్మెంట్ అధికారుల పర్యవేక్షణ లోపంతో స్థానిక అధికారులు బియ్యం అక్రమ రవాణాకు దారి ఇస్తున్నట్లు తెలుస్తోంది. మొన్నటిదాకా ఈ రేషన్ బియ్యం మహారాష్ట్ర కు తరలించేందుకు ఒక ముఠా మాత్రమే ఉండేది . కానీ ఇప్పుడు ప్రజలు దుకాణాల డీలర్లు కూడా  వారితో చేతులు కలిపి అడ్డదారులు తొక్కుతున్నారు. ఇవన్నీ తెలిసిన రెవెన్యూ అధికారులు నెల చివర్లో  తమకు వచ్చే మామూలు వస్తే సరి  పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular