నేటి నుండి మంథనిలో శ్రీ దత్తాత్రేయ నవరాత్రి ఉత్సవాలు

- Advertisement -

నేటి నుండి మంథనిలో శ్రీ దత్తాత్రేయ నవరాత్రి ఉత్సవాలు

Sri Dattatreya Navratri celebrations in Manthani from today

-7వ తేదీ నుండి 15వ తేదీ వరకు
జరిగే శ్రీ దత్తాత్రేయ ఉత్సవాలకు ఘనంగా ఏర్పాట్లు

-భక్తులకు మోక్షం ప్రసాదించే అవతారమే శ్రీ దత్తాత్రేయ అవతారం

మంథని

మంథని పట్టణంలోని శ్రీ దత్తాత్రేయ స్వామి దేవాలయంలో శనివారం నవరాత్రి ఉత్సవములు ఘనంగా ప్రారంభం కానున్నాయి. తొమ్మిది రోజులపాటు జరిగే ఈ ఉత్సవాల్లో భక్తులు అధిక సంఖ్యలో స్వామివారిని దర్శించుకుని ఆలయంలో జరిగే దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. నవరాత్రుల్లో గణపతి పూజతో ప్రారంభమై పుణ్యాహవచనము, సహస్ర నామార్చన, మంగళ హారతి, మంత్రపుష్పము వంటి కార్యక్రమాలు తొమ్మిది రోజులపాటు నిర్వహించబడతాయి. షష్టి తిథి నుండి పౌర్ణమితి ( 7వ తేదీ నుండి 15వ తేదీ) వరకు నిర్వహించబడే ఈ నవరాత్రి ఉత్సవాలకు ఘనంగా ఏర్పాట్లు చేశారు. దూర్వాస మహర్షి అంబరీసునికి ఇచ్చిన శాపములను విష్ణుమూర్తి గ్రహించి అనేక అవతారములు స్వీకరించారు. వాటిలో శ్రీ దత్తాత్రేయ అవతారం ఒకటి. ముఖ్యంగా ఈ అవతార ఉద్దేశము ప్రజలు సులభంగా మోక్షము పొందుటకు యోగాభ్యాసమును అభివృద్ధి పరచుట కొరకై అవతరించిన అవతారమే శ్రీ దత్తాత్రేయ అవతారం. మార్గశిర శుద్ధ పౌర్ణమి రోజున శ్రీ దత్తాత్రేయ స్వామి జన్మదినం. శ్రీ దత్తాత్రేయ అవతారము శాశ్వతముగా నిలిచే అవతారము. ఆ క్రమంలో పిఠాపురంలో శ్రీపాద శ్రీ వల్లభునిగా, కరంజాలో శ్రీ నరసింహ సరస్వతిగా అవతరించి జనులకు సుఖ సంపదలను ప్రసాదిస్తున్నారు.  రాత్రి 7 గంటల నుండి 10 గంటల వరకు 9 రోజులపాటు ప్రత్యేకంగా భజన కార్యక్రమం నిర్వహిస్తారు. పట్టణంలోని భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. తొమ్మిది రోజులపాటు ఆలయంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించబడుతుంది. నవరాత్రి ఉత్సవములు అనంతరం అష్టమి తిథి రోజు శ్రీ అనగా దేవి వ్రత కార్యక్రమం నిర్వహిస్తామని ఆలయ పూజారి కొల్లారపు వెంకట రాజం తెలిపారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular