మన ఆస్తిపై మనదే హక్కు
Our property is oursభూ తగాదాలు లేని ఆంధ్రప్రదేశ్ గా మార్చాలన్న దే చంద్రబాబు ఆశయం
ఆస్తి తగదాలతో తగ్గుతున్న కుటుంబ సంబంధాలు
రెవిన్యూ సదస్సులో పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి వెల్లడి
పుట్టపర్తి :06
మన పూర్వీకుల నుంచి వంశపార్యంగా వచ్చిన మన ఆస్తికి మనమే హక్కుదారులమని అని పుట్టపర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి పేర్కొన్నారు.
పుట్టపర్తి నియోజకవర్గం లోని పుట్టపర్తి మండలంలోని కొట్లపల్లి పంచాయితీలోని సచివాలయం వద్ద శుక్రవారం నిర్వహించిన రెవెన్యూ సదస్సులో ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి ఈ సందర్భంగా మాట్లాడారు. భూ తగాదాలు లేని ఆంధ్రప్రదేశ్ గా మార్చాలన్నదే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆశయమన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 26 జిల్లాల్లో భూతగాదాలు లేని రాష్ట్రంగా మార్చేందుకు ఈ రెవిన్యూ సదస్సులను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. గ్రామాల్లో ఆస్తుల సంబంధించిన విషయాలలో కుటుంబ సభ్యుల మధ్య సంబంధాలు పూర్తిగా తగ్గిపోతున్నాయని అన్నారు. మానవ సంబంధాలు దెబ్బతినకుండా ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ లు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పంచాయతీల్లో రెవిన్యూ సమస్యలు పరిష్కారం చూపాలని ఒక గొప్ప కార్యక్రమాన్ని చేపట్టినందుకు ఎమ్మెల్యే గా నా నియోజకవర్గ ప్రజల తరఫున వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. గత ఐదేళ్ల వైసిపి పాలనలో రాష్ట్రంలో భూ దందాలు అరాచకాలు దౌర్జన్యాలు పెట్రేగిపోయాయని గుర్తు చేశారు. గ్రామాల్లో ఎక్కడ చూసినా భూ సమస్యలు అధికంగా ఉన్నాయని చెప్పారు. గత వైసిపి పాలనలో అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన ల్యాండ్ టైటిల్ యాక్ట్ వల్ల ప్రజల ఆస్తులకు భద్రత లేకుండా పోయిందని టిడిపి అధికారంలోకి రాగానే దాన్ని రద్దుచేసి విషయాన్ని ఎమ్మెల్యే గుర్తు చేశారు. అప్పటి ప్రభుత్వంలో మన ఆస్తుల రికార్డుల్లో వైసీపీ పెద్దల ఫోటోలు పెట్టుకుని ప్రచార యావ తో భారీగా నిధులను దుర్వినియోగం చేశారని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే అలాంటి వాటికి పుల్ స్టాప్ పెట్టిందని ఎమ్మెల్యే వెల్లడించారు. వైసిపి నేతల నిర్వహణ వల్ల రాష్ట్రంలో భూ రికార్డులు తారు మారయ్యాయని పేర్కొన్నారు. ఆస్తుల విషయాల్లో చిన్న చిన్న సాంకేతిక కారణాలతో అసలైన భూ హక్కుదారులు కాకుండా ఇతరులు భూమిని కాజేసే విధంగా ఒక భూ మాపియా రాష్ట్రంలో నడిచిందని పేర్కొన్నారు. ఈ మాఫియా రాజ్యానికి పుల్ స్టాప్ పెట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎంతో మంచి ఉద్దేశంతో రెవిన్యూ సదస్సులు ఏర్పాటు చేసి అసలైన భూహక్కుదారులకు రక్షణ కవచంగా నిలిచారని కొనియాడారు. రెవెన్యూ సదస్సులను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే కోరారు. ఆర్డీవో సువర్ణ మాట్లాడుతూ గ్రామాల్లో భూ సమస్యలు లేకుండా చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం రెవెన్యూ సదస్సులను ఏర్పాటు చేసిందని ప్రతి ఒక్క రైతు ఈ సదస్సుకు హాజరై తమ భూ సమస్యలను పరిష్కరించుకోవాలని రైతులకు పిలుపునిచ్చారు. అనంతరం రైతుల నుంచి అర్జీలను స్వీకరించి అక్కడికక్కడే లబ్ధిదారులకు పరిష్కారం చూపాలని ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి ఆర్డీవో సువర్ణ , తహసిల్దార్ అనుపమ ఇతర రెవిన్యూ అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ అధికారులు స్థానిక ప్రజా ప్రతినిధులు కూటమి పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.




