రుణమాఫీలో కేంద్రం బాధ్యతలను విస్మరించడం తగదు

- Advertisement -

రుణమాఫీలో కేంద్రం బాధ్యతలను విస్మరించడం తగదు

It is not appropriate to ignore the responsibilities of the Center in loan waiver

రైతు బిడ్డ గా తెలంగాణా తల్లి విగ్రహం..

రాష్ట్ర ప్రభుత్వ  సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శం

కాంగ్రెస్ పట్టభద్రుల ఎమ్మెల్సీ టి. జీవన్ రెడ్డి వ్యాఖ్య

జగిత్యాల, డిసెంబర్ 08
తులకు రుణమాఫీ చేసే విషయంలో ఒక రాష్ట్రానికే బాధ్యత ఉంటుందా..?
కేంద్రానికి బాధ్యతలేదా అని మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత, పట్టభద్రుల ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్‌ రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
యూపీఏ హయంలో రుణ మాఫీ విషయంలో కేంద్రమే బాధ్యత తీసుకుందని కానీ బీజేపీ ప్రభుత్వం  కేంద్రం తన భాత్యతల నుంచి తప్పుకుంటుందని ఆయన విమర్శించారు.బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణా తల్లి విగ్రహం రాచరిక వ్యవస్థకు అద్దం పట్టేలా రూపొందించారని దాని స్థానంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం రైతు బిడ్డను పోలి ఉండేలా తెలంగాణ తల్లి విగ్రహాన్ని రూపొందించామని  చెప్పారు.ఆదివారం జీవన్ రెడ్డి జగిత్యాల లోని ఇందిరభవన్ లో విలేకరులతో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వ పాలన విజయవంతంగా సంవత్సర కాలం పూర్తి చేసుకున్న సందర్భంగా రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు.
దేశంలో ఎక్కడ లేని విధంగా 200ల యూనిట్ల ఉచిత కరెంటు, మహిళలకు ఉచిత బస్సు రవాణా సౌకర్యం, 500 లకే సిలిండర్ పంపిణీ చేయడం జరుగుతుందన్నారు.
ఈ పథకాల అమలుకు కోసం పది వేల కోట్లు రాష్ట్రం ప్రభుత్వం రాయితీ వెచ్చించిందని జీవన్ రెడ్డి వివరించారు.
తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు విషయంలో భారాస మిర్శలు తగవన్నారు.
తెలంగాణ తల్లి అనేది సామాన్యుల తల్లి అన్ని వర్గాలకు అనుకూలంగా ఉందన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని నియోజకవర్గాల్లో రెసిడెన్షియల్ స్కూళ్లల్లో  సొంత భవనాలు కట్టించే కార్యక్రమం చేపట్టిందన్నారు.
రైతులు పండించిన
సన్న రకం వరికి మద్దతు ధరతో పాటు 500ల బోనస్ ఇస్తున్న రాష్ట్రం ప్రభుత్వం దేశంలో ఏ రాష్ట్రంలో ను ఇవ్వడం లేదన్నారు.మహిళా సంక్షేమం కోసం తెలంగాణా రాష్ట్రంలో ఎన్నో అమలు చేస్తున్నామని దేశంలో మీరెక్కడైన అమలు చేస్తున్నారా అని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డ  చెప్పాలని జీవన్ రెడ్డి ప్రశ్నించారు.
క్రిషి విజ్ఞాన కేంద్రాలను కేంద్ర ప్రభుత్వం పూర్తి నిర్వహణ చేస్తుందని చెబుతూ ఈ విజ్ఞాన కేంద్రాన్ని  జగిత్యాలకు వచ్చే విధంగా కృషి చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కోరారు.ఈ సమావేశంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు కొత్త మోహన్,జగిత్యాల బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు గాజంగి నందయ్య,
జిల్లా యూత్ కాంగ్రెసు అధ్యక్షులు బీరం రాజేష్, బండ శంకర్, కౌన్సిలర్లు దుర్గయ్య, నక్క జీవన్,జగిత్యాల  మండల కాంగ్రెస్ అధ్యక్షుడులు జున్ను రాజేందర్,గుండా మధు, జగిత్యాల పట్టణ యూత్ కాంగ్రెసు అధ్యక్షులు తాటిపర్తి పరిక్షిత్ రెడ్డి, నాయకులు గాజుల రాజేందర్, ధర రమేష్ బాబు, ఎన్నం మదూకర్ రెడ్డి, నల్ల స్వామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular