పరిపూర్ణనమైన ఓటర్ జాబితా తయారు చేయాలి

- Advertisement -

పరిపూర్ణనమైన ఓటర్ జాబితా తయారు చేయాలి

A complete voter list should be prepared

అయేషా మస్రత్ ఖాన్

జయశంకర్ భూపాలపల్లి,

ప్రజాస్వామ్య దేశంలో ఓటు హక్కుకు చాలా ప్రాధాన్యత సంతరించుకుందని,ఎలాంటి పొరపాటు కు  ఆస్కారం లేకుండా పరిపూర్ణమైన ఓటరు జాబితా తయారు చేయాలని ఓటరు జాబితా పరిశీలకురాలు  అయేషా మస్రత్  ఖాన్ తెలిపారు.  శనివారం ఐడిఓసి కార్యాలయంలో ఓటరు జాబితా రూపకల్పన, ఫారం 6, 7 మరియు 8  పరిష్కారం తదితర అంశాలపై జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి రాహుల్ శర్మతో కలిసి రిటర్నింగ్ అధికారులు, సహాయ రిటర్నింగ్ అధికారులు,  పర్యవేక్షకులు,  బూత్ స్థాయి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ భూపాలపల్లి నియోజకవర్గ పరిధిలో 8 మండలాలలో 317 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయని, వాటి పరిధిలో  1,36,778 మంది పురుషులు,   1,40,649 మంది
మహిళలు, 8 మంది థర్డ్ జెండర్స్
మొత్తం 2,77,435 మంది ఓటర్లున్నట్లు తెలిపారు. వీరిలో 18-19 సంవత్సరాల వయస్సు కలిగిన  4,317 మంది నూతన ఓటర్లుగా నమోదయారని తెలిపారు. ప్రత్యేక ఓటరు సవరణ కార్యక్రమంలో భాగంగా 1.1.2025  నాటికి 18 సంవత్సరాలు నిండే ప్రతి ఒక్కరిని ఓటరుగా నమోదు చేయాలన్నారు.
నూతన ఓటరు నమోదు, మార్పులు చేర్పులు, మరణించిన వ్యక్తుల పేర్లు తొలగింపు పక్రియలో తగు జాగ్రత్తలు పాటించాలని సూచించారు.  ముక్యంగా మరణించిన వ్యక్తుల తొలగింపులో మరణ ధ్రువీకరణ పత్రం చాలా ముఖ్యమని నోటీస్ జారి చేయాలని సూచించారు.  నూతన ఓటర్లు  నమోదు పట్ల ఆమె అభినందించారు. ప్రతి ఫైల్ జాగ్రత్తగా భద్రపరచాలని సూచించారు. జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ మాట్లాడుతూ గత నెల 9, 10 మరియు 23, 24 తేదీల్లో అన్ని పోలింగ్ కేంద్రాల్లో ప్రత్యేక క్యాంపులు నిర్వహించి ఓటరు జాభితా అందుబాటులో ఉంచడంతో పాటు నూతన ఓటరు నమోదు, మార్పులు, చేర్పులు దరఖాస్తులు స్వీకరించామని, వచ్చిన అభ్యన్తరాల దరఖాస్తులు ఈ నెల 24వ తేదీ వరకు పరిష్కరిస్తామని తెలిపారు.
నియోజకవర్గ పరిధిలో ఫారం 6, 7 మరియు 8 కలిపి మొత్తం  849 దరఖాస్తులు  ఉన్నాయని వీటన్నిటిని ఈనెల 24వ తేదీ వరకు పరిష్కరిస్తామని ఆయన తెలిపారు .
అనంతరం బూతుస్తాయి అధికారుల రిజిస్టర్లు, బూతు స్థాయి అధికారుల మొబైల్ యాప్ పరిశీలించారు.
ఈ కార్యక్రమంలో కాటారం సబ్ కలెక్టర్ మయాంక్ సింగ్,  అదనపు కలెక్టర్ అశోక్ కుమార్,  ఆర్డిఓ మంగీలాల్, ఎన్నికల సెక్షన్ డిటీలు అబ్బాస్, ఇమామ్, అన్ని మండలాల తహసిల్దారులు,  పర్యవేక్షకులు,  బూత్ స్థాయి అధికారులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular