ప్లాస్టిక్ ను నిషేధిద్దాం..పర్యావరణాన్ని కాపాడుదాం…
Let's ban plastic..let's save the environment...16వ వార్డు కౌన్సిలర్ బలిజ పద్మా రాజారెడ్డి
కోరుట్ల,
ప్లాస్టిక్ ను నిషేధిద్దాం.. పర్యావరణాన్ని కాపాడుదామని పట్టణానికి చెందిన 16వ వార్డు మున్సిపల్ కౌన్సిలర్ బలిజ పద్మా -రాజారెడ్డి ప్రజలను కోరారు. ఆదివారం వార్డులో పలు మహిళా సంఘాల సభ్యులకు జుట్ బ్యాగులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్లాస్టిక్ బ్యాగులు వాడడం వల్ల మనిషికి ఎంతో నష్టం జరుగుతుందన్నారు. ప్లాస్టిక్ భూమిలో ఉండిపోయి రాబోయే రోజుల్లో అనేక ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉంటాయన్నారు. ప్రతి ఒక్కరూ ప్లాస్టిక్ బ్యాగులను నిషేధించాలని కోరారు. ఏ వస్తువుకు వెళ్లిన మన ఇంటి నుండే బట్ట సంచులను కానీ జుట్ బ్యాగులను తీసుకెళ్లాలని కోరారు. ఇండ్లల్లో నీ చెత్తను రోడ్డుపైన మురికి కాలువలలో వేయకూడదన్నారు. తడి పొడి చెత్తను వేరు చేసి మున్సిపల్ ఆధ్వర్యంలో వచ్చే చెత్త బండికి అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆర్పి పావని, మహిళా సంఘాల ప్రతినిధులు, గుడిసెల తుక్కమ్మ, కాశమ్మ బలిజ లావణ్య తదితరులు ఉన్నారు




