శరీర దానానికి ముందుకు వచ్చిన విశ్రాంత ఉపాధ్యాయ దంపతులు

- Advertisement -

శరీర దానానికి ముందుకు వచ్చిన విశ్రాంత ఉపాధ్యాయ దంపతులు

A retired teacher couple who came forward for body donation

అభినందించిన ఉపాధ్యాయులు
స్నేహితులు

పెద్దపల్లి

తన పదవీ విరమణ సభలో
మరణానంతరం దేహదానం కోసం ముందుకు వచ్చారు ఓ ఉపాధ్యాయుడు.

ఇటీవల ఉద్యోగ సంఘాల నేత,
విశ్రాంత ఎంఈఓ వీరగోని పెంటయ్య  తన సతీమణి లక్ష్మి మృతిచెందగా, ఆమె పార్థివ దేహాన్ని వైద్య విద్యార్థుల కోసం
చలి మెడ ఆనందరావు వైద్య విజ్ఞాన సంస్థకు అందజేసిన విషయం తెలిసిందే.

ఆ స్ఫూర్తితోనే తాము కూడా మరణానంతరం దేహ దానం చేస్తామని సదరు ఉపాధ్యాయ దంపతులు ప్రకటించారు.

పెద్దపల్లి జిల్లా గుర్రంపల్లి గ్రామ ప్రాధమిక పాఠశాల ప్రధానో పాధ్యాయుడు నేదునూరి కనకయ్య పదవీ విరమణ కార్యక్రమం ఆదివారం పాఠశాల ప్రాంగణంలో జరిగింది. ఈ సందర్భంగా రేణుక -కనకయ్య దంపతులు సదాశయ ఫౌండేషన్ జాతీయ అధ్యక్షులు టి. శ్రవణ్ కుమార్ ఆధ్వర్యంలో శరీరదానానానికి ముందుకు రాగా వారిని ఫౌండేషన్ ప్రతినిధులు శాలువతో సత్కరించి,గ్రీన్ గిఫ్ట్  జ్ఞాపిక అందించి అభినందనలు తెలిపారు.

ఈ సందర్భంగా కనకయ్య  మాట్లాడుతూ సదాశయ ఫౌండేషన్ సభ్యునిగా నేత్ర, అవయవ ,శరీర దాన కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనే అవకాశం లభించింది అన్నారు.
ఈ కార్యక్రమాల స్ఫూర్తితో
మరణానంతరం తమ దంపతులు
దేహదానం చేయాలనే నిర్ణయానికి వచ్చినట్లు చెప్పారు.

ఆదర్శవంతమైన ఈ నిర్ణయం పట్ల పదవి విరమణ సభకు  అతిథులుగా విచ్చేసిన మండల విద్యాధికారులు సురేంద్ర కుమార్,ఆగయ్య,జిల్లా టిపిటి ఎఫ్  నాయకులు పోచయ్య, పరుశురాములు,రాజనర్సు, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల  ప్రధాన ఉపాధ్యాయురాలు జానకి,
ప్రాథమిక పాఠశాల  హెచ్.యం సుమిత్ర,గ్రామ నాయకులు నర్సింహా రెడ్డి, తిరుపతి రెడ్డి, మహేందర్ రెడ్డి, కనుకయ్య  చిన్ననాటి స్నేహితులు నర్సయ్య,రాజయ్య,ఎర్రన్న ,     కిష్టయ్య దేహదాన నిర్ణయం తీసుకున్న దంపతులను సత్కరించి, వారి నిర్ణయాన్ని అభినందించి, ధన్యవాదాలు తెలిపారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular