- Advertisement -
బాలికపై పేట్రోల్ దాడి బాలిక మృతి..
Patrol attack on girl, girl died..నంద్యాల
నంద్యాల జిల్లా నందికొట్కూరులో దారుణం చోటుచేసుకుంది. ప్రేమించలేదనే కారణంతో ఇంటర్ చదువుతున్న బాలికపై మైనర్ బాలుడు పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఈ ఘటనలో బాలిక మృతిచెందింది. ఘటనలో బాలుడికి మంటలు అంటుకోవడంతో గాయాలయ్యాయి. నందికొట్కూరులో బాలికపై పెట్రోల్ దాడి ఘటనపై హోంమంత్రి అనిత ఆగ్రహం వ్యక్తం చేసారు. .ప్రేమించలేదనే కారణంతో ఇంటర్ విద్యార్థినిపై బాలుడు పెట్రోల్ పోసి నిప్పటించిన ఘటనపై సమగ్ర విచారణ సత్వరమే జరపాలని ఆదేశించారు. పెట్రోల్ దాడి ఘటనలో బాలిక మృతి అత్యంత బాధాకరమని అన్నారు. నంద్యాల జిల్లా ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణాతో ఫోన్ లో మాట్లాడి ఘటన వివరాలు అడిగి తెలుసుకున్నారు.
- Advertisement -



