మండలంలో మల్లన్న బోనాల సందడి

- Advertisement -

మండలంలో మల్లన్న బోనాల సందడి

Mallanna bonala noise in the mandal

తాండూర్
తాండూర్ మండలం నగరం శివారులోని మల్లన్న గుట్ట వద్ద మల్లన్న బోనాలతో పండుగ వాతావరణం నెలకొంది.సంవత్సరానికి ఒకసారి వచ్చే డిసెంబర్ మాసంలో మల్లన్న బోనాలకు ఒక ప్రత్యేకత ఉంటుంది. ఆదివారం రోజున వివిధ ప్రాంతాల నుంచి చాలామంది ఈ ప్రాంతానికి చేరుకొని గుట్టపై ఉన్న మల్లన్న దేవాలయం వద్ద మొక్కులు చెల్లించుకుని గుట్ట కింద సాంప్రదాయ పద్ధతిలో బోనం పోసి ఈక్కడే వండుకొని కుటుంబ సభ్యులతో కలిసి అందరూ సహపంక్తి భోజనం చేసి వెళ్తుంటారు .సంవత్సరాని ఒక్కసారి వచ్చే ఈ పండుగ వేడుకలకు ఈ ప్రాంతంలో ఎంతో సంతోషంగా జరుపుకుంటారు .అటవీ ప్రాంతంలోని గుట్టపై ఉన్న మల్లన్న దేవున్ని చాలామంది భక్తులు దర్శించుకుంటారు. కానీ ఈ ప్రాంతంలో భక్తులకు ఎలాంటి సౌకర్యాలు లేకపోవడంతో వారే తమఇంటి వద్ద నుంచి అన్ని రకాల వస్తువులను ఇక్కడకు తీసుకు వచ్చి వంటలు చేసుకొని వెళ్ళిపోతున్నారు. కనీసం త్రాగడానికి కూడా మంచి సౌకర్యం లేకపోవడం గుట్టపైకి కూడా వెళ్లడానికి సరైన దారి లేకపోవడంతో భక్తులు చాలా ఇబ్బందులు పడుతున్నారు .ఇప్పటికైనా సంబంధిత అధికారులు కానీ ప్రజాప్రతిని కానిదృష్టి సారించి మల్లన్న గుట్ట వద్ద భక్తులకు అన్ని రకాల సౌకర్యాలు కల్పించాలని కోరుతున్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular