- Advertisement -
అలరించిన నేవీ బ్యాండ్ మ్యూజిక్
Navy band music entertainedవిశాఖపట్నం
విశాఖ సాగరతీరంలో నేవీ బ్యాండ్ మ్యూజిక్ హోరెత్తింది.57వ సబ్ మెరైన్ దినోత్సవం సందర్బంగా నేవీ సిబ్బంది లైవ్ మ్యూజిక్ తో ప్రజలను అలరించారు.ఆకట్టుకునేలా నేవీ సిబ్బంది మ్యూజిక్ కు ప్రజలు మైమరిచిపోయారు.సాయంత్రం వెళ సాగరతీర అందాలను తిలకించేందుకు వచ్చే ప్రజలను నేవీ మ్యూజిక్ కట్టి పడేసింది.కెరటాలతో పోటీ పడుతూ నేవీ సిబ్బంది వాయిద్యాల నుంచి పుట్టుకొచ్చిన మ్యూజిక్ హైలేట్ గా నిలిచింది.ఈ మ్యూజిక్ ను నేవీ అదికారులు కూడా తిలకించారు.నేవీ సిబ్బంది మ్యూజిక్ కార్యక్రమంతో ఆర్కెబీచ్ వద్ద సందడి వాతావరణం నెలకొంది.
- Advertisement -




