- Advertisement -
సీఎం ఆశీర్వాదం తీసుకున్న జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు అవినాష్
District Youth Congress president Avinash took the CM's blessings
పెద్దపల్లి
రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యూత్ కాంగ్రెస్ పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు బొంకూరి అవినాష్ ను ఆశీర్వదించారు. ఇటీవల జరిగిన యూత్ కాంగ్రెస్ ఎన్నికల్లో పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడుగా బొంకూరి అవినాష్ భారీ మెజారిటీతో గెలుపొందగా, హైదారాబాద్ లో సీఎం రేవంత్ రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అవినాష్ ను ప్రత్యేకంగా అభినందించి వెన్ను తట్టారు. ఇదే స్పూర్తితో ముందుకు సాగుతూ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి పనిచేయాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. పార్టీ కోసం పనిచేసిన వారికి తప్పక గుర్తింపు ఉంటుందని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అవినాష్ కృతజ్ఞతలు తెలిపారు.
- Advertisement -



