Saturday, February 14, 2026

సింగరేణి ఆవిర్భావ దినోత్సవ వేడుకలు.

- Advertisement -

సింగరేణి ఆవిర్భావ దినోత్సవ వేడుకలు.

Singareni Emergence Day Celebrations. 

గోదావరిఖని
సింగరేణి ఆవిర్భావ దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని తేది. 23.12.2024 న రామగుండం ఏరియా-1 లోని స్థానిక జవహర్ లాల్ నెహ్రూ క్రీడా మైదానం నందు సింగరేణి దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవముగా నిర్వహించబడును. ఈ సందర్భముగా ఈ క్రింద పేర్కోన్న కార్యక్రమములు నిర్వహించబడును.
గృహ శోభ పోటీలు  19.12.2024 పర్యావరణ సహిత పచ్చదనంతో ఆహ్లదకరమైన గృహములు అనగా కంపెనీ క్వార్టర్స్ మాత్రమే  పోటీలు నిర్వహించబడును. పోటీలలో పాల్గోను ఆసక్తి గల ఉద్యోగులు తమ పేరు, క్వార్టర్  నెం, సెల్ పోన్ నెం తదితర వివరములను ఆర్జీ-1 జియం కార్యలయం లోని సింగరేణి సేవా సమితి కార్యలయం నందు నమోదు చేసుకొనగలరు.
దీపాళంకరణ  20.12.2024 రోజున  మహిళలకు యువతులకు సాయంత్రం  4.00 గంటలకు ఆర్.సి.ఓ.ఎ క్లబ్ నందు దీపాళంకరణ పోటీలు నిర్వహించబడును. ఆటల పోటీలు
21.12.2024 మధ్యాహ్నం  3.00 ఆటల పోటీలు (మహిళలకు మాత్రమే)  సింగరేణిలో పని చేయుచున్న ఉద్యోగులకు, గృహిణులకు, వారి పిల్లలకు, యువతులకు, సింగరేణి ప్రభావిత మరియు పరిసర ప్రాంత మహిళలకు వివిధ ఆటల పోటీలు స్థానిక జియం కాలనీ గ్రౌండ్ నందు 3.00  గంటల నుండి నిర్వహించబడును.
23.12.2024 సింగరేణి ఆవిర్భావ దినోత్సవ వేడుకల సందర్భముగా జవహర్ లాల్ నెహ్రూ క్రీడా మైదానం నందు ఉదయం 9.00 గంటలకు జెండా ఆవిష్కరణ, వివిధ డిపార్ట్ మెంట్స్ స్టాల్స్ మరియు సింగరేణి సేవా సభ్యులచే ఏర్పాటు చేసిన తెలంగాణ రుచుల తిను బండారముల స్టాల్స్ ప్రాంరంభించబడును.  సాయంత్రం 6.30 నిల నుండి సింగరేణి దినోత్సవ వేడుకలు అత్యంత వైభవముగా పలు సాంస్కృతిక కార్యక్రమములతో పాటు ఉత్తమ ఉద్యోగులకు సన్మానం, ఉత్తమ సేవా సభ్యులకు జ్ఞాపికలు మరియు పలు పోటీలలో పాల్గోన్న విజేతలకు బహుమతుల ప్రధానం అందజేయబడును.
కావున ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకొని సింగరేణి ఉద్యోగులు, యూనియన్ ప్రతినిధులు, అధికారులు మరియు సింగరేణి ప్రభావిత ప్రాంత మరియు పారిశ్రామిక ప్రాంత ప్రజలు కుటుంబ సభ్యులతో హాజరయి పసందైన తెలంగాణ వంటకాలను రుచి చూసి, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయగలరని తెలియజేయనైనది.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్