- Advertisement -
ప్రజా సమస్యలపై వైకాపా పోరాటాలు
YCP struggles on public issuesఎమ్మెల్సీ బోత్స
విశాఖపట్నం
తాజాగా ప్రభుత్వం నిర్వ హించిన మెగా పేరెంట్ టీచర్ మీ టింగ్ను ఉద్దేశిస్తూ ఎమ్మెల్సీ బొత్స సత్యానారాయణ పలు వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేశారు. వైసీపీ హయాంలో నాడు- నేడు కార్యక్రమంలో చేపట్టిన అభివృద్ధి పనులు పేరెంట్ టీచర్స్ మీటింగ్లో కనిపించాయంటూ కామెంట్స్ చేశారు. విశాఖలో డ్రగ్స్ వ్యవహా రంపై తాను మళ్ళీ కేంద్రానికి లేఖ రాస్తున్నట్లు తెలిపారు.డ్రగ్స్కు సంబంధించి విష ప్రచారం చేసి ఎన్నికల్లో లబ్ధి పొందారని విరుచు కుపడ్డారు. ఉమ్మడి విశాఖ జిల్లా ప్రజా ప్రతినిధులు పార్టీల నాయకు లతో సమావేశం నిర్వహించామని తెలిపారు. ప్రజల సమస్యలపై పోరా టం చేయాలని పార్టీ నిర్ణయించిందన్నారు. వర్షాల నేపథ్యంలో రైతాంగం ఇబ్బందులపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈనెల13 వ తేదీన అన్ని కలక్టరేట్లో వినతిపత్రలు అందజేస్తామన్నారు. ఈనెల 27వ తేదీన విద్యత్ చార్జీలు పెంపుపై విద్యుత్ కార్యాలయాలలో వినతిపత్రలు అందజేయనున్నట్లు వెల్లడించారు. విద్యుత్ భారాలను ప్రభుత్వమే భరించాలని డిమాండ్ చేశారు.
- Advertisement -




