గర్భిణీ కు పౌష్టిక ఆహారం పంపిణీ

- Advertisement -

గర్భిణీ కు పౌష్టిక ఆహారం పంపిణీ

Distribution of nutritious food to pregnant women 

పత్తికొండ ఎమ్మెల్యే కే ఈ శ్యామ్ కుమార్
పత్తికొండ
పత్తికొండ ప్రభుత్వ ఆసుపత్రిలో స్కానింగ్ కోసం వచ్చిన గర్భిణీ లకు పత్తికొండ ఎమ్మెల్యే కే ఈ శ్యామ్ కుమార్ ఆధ్వర్యంలో  పౌష్టిక ఆహారం పంపిణీ చేశారు. దూర ప్రాంతాల నుండి వచ్చే గర్భిణీ స్త్రీలకు ఆహారం వడ్డించారు. ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే రోగులకు ,గర్భిణీ స్త్రీలు, రోగులు భోజన సదుపాయం కావాలంటే పట్టణంలోకి రెండు కిలోమీటర్లు ప్రయాణం చేయవలసి ఉంది. వారి ఇబ్బందులను తెలుసుకున్న ఎమ్మెల్యే కేఈ శ్యాం కుమార్ గారు భోజన సదుపాయం ఏర్పాటు చేశారు. హాస్పిటల్‌ కు వచ్చే గర్భిణీ స్త్రీలకు రోగులకు అన్నం పెట్టడం చాలా గొప్ప కార్యక్రమమని అన్నారు. ప్రభుత్వ జనరల్‌ హాస్పిటల్‌లో 300మందికి అన్నదానం చేస్తున్నామని అని అన్నారు. విరి సేవలను ఆసుపత్రికి వచ్చే రోగులు కొనియాడారు.ఇంత మంచి కార్యక్రమం చేస్తున్నందుకు ఎమ్మెల్యే కే ఈ శ్యామ్ కుమార్ కు రోగుల బంధువులు హృదయ పూర్వక ధన్యవాదాలు తెలియ జేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్  కల్పన, మార్రెళ్ళ వెంకట్రాముడు, శివరాముడు, టిడిపి ఆఫీస్ ఇంఛార్జ్ హరినాథ్, తిక్క రమేష్,  కోటేశ్వర గౌడ్, పరమేశ్,చిన్నా, భాస్కర్,బాబా,లచ్చి, తదితరులు  పాల్గొన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular