సీఐ శ్రీనివాస్ పై చేయి చేసుకున్న ఆశ కార్యకర్త

- Advertisement -

సీఐ శ్రీనివాస్ పై చేయి చేసుకున్న ఆశ కార్యకర్త

Asha activist Slapped CI Srinivas

హైదరాబాద్
హైదరాబాద్ కోఠి డీఎం ఈ కార్యాలయం ఆవరణలో సోమవారం ఆశావర్కర్లు ఆందోళన చేపట్టారు. సీఎం రేవంత్ రెడ్డి,ఆశా వర్కర్లకు ఇచ్చిన హామీ ప్రకారం రూ.18000 ఫిక్స్డ్ జీతాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఆశా వర్కర్లు నిరసన తెలిపారు.
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఆశావర్కర్లకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని ఆశాలు డిమాండ్ చేశారు. దీంతో డీఎంఈ ఆఫీస్ వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొంది.
రంగంలోకి దిగిన పోలీ సులు, ఆశాలకు మధ్య వాగ్వాదం చోటు చేసు కుంది. ఈ నేపథ్యంలోనే వారికి నచ్చజెప్పేందుకు ప్రయత్నించిన ఏసీపీ శంకర్ను ఆశ కార్యకర్తలు  చుట్టుముట్టారు.
దీంతో పోలీసులు ఆశావర్కర్లను అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో ఓ సంఘటన చోటుచేసుకుంది. పోలీస్ స్టేషన్లకు తరలించే డీసీఎంలో ఉన్న ఆశా వర్కర్.. సుల్తాన్ బజార్ సీఐ శ్రీనివాస్ చారిపై చేయి చేసుకున్నారు. ఆశా వర్కర్ చేయిచేసు కోవడంపై పోలీసులు సీరియస్ అయ్యారు. అయితే, అలా ఆశా వర్కర్ ప్రవర్తించడానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. కాగా, ఇందుకు సంబంధించిన వీడియో వైరల్గా మారింది.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular