ఏడు గంగమ్మల జాతరకు దక్షిణ కైలాసం ముస్తాబు
South Kailash ready for the seven Gangammas fairధి శ్రీకాళహస్తి డిసెంబర్ 9
ఆధ్యాత్మిక క్షేత్రంగా దక్షిణ కైలాసంగా పేరుగాంచిన శ్రీకాళహస్తిలో ఏడు గంగమ్మల జాతర అత్యంత వైభవంగా నిర్వహించడానికి సన్నాహాలు ముమ్మరంగా సాగుతున్నాయి. డిసెంబర్ 10, 11వ తేదీల్లో ఏడు గంగమ్మల జాతర అంగరంగ వైభవంగా జరుగుతుంది. రాష్ట్రంలోనే శ్రీకాళహస్తి పట్టణంలో నిర్వహించే ఏడు గంగమ్మల జాతర అత్యంత ప్రసిద్ధి చెందింది ఎక్కడైనా జాతరలు వేసవి కాలంలో నిర్వహించడం ఆనవాయితీ అయితే శ్రీకాళహస్తిలో ఏడు గంగమ్మల జాతరకు శీతాకాలంలో డిసెంబర్ మొదటి లేదా రెండో వారంలో నిర్వహించడం ప్రత్యేకత అంతేకాక జాతర అంటే మూలస్థానంలో అమ్మవారిని కొలువు దీర్చి పూజలు నిర్వహించి సంబరాలు నిర్వహించుకోవడం జరుగుతుంది అయితే గంగ జటా ధరుడు కొలువుదీరిన దక్షిణ కైలాసంలో గంగమ్మ తల్లి ఏడు రూపాలుగా భక్తులకు దర్శనమిస్తూ ఏడు ప్రాంతాల్లో కొలువు దీరిన భక్తజన కొంగుబంగారంగా బాసిల్లుతూ కోరిన కోరికలు తీర్చే అమ్మవారిగా విశ్వరూపిణిగా దర్శనమివ్వడం ఈ ఏడు గంగమ్మల జాతర ప్రత్యేకత ఏడు గంగమ్మ ల జాతరను ఆయా జాతర కమిటీలు ఏర్పడి పోటాపోటీగా గంగమ్మలను అలంకరించేందుకు సిద్ధమవుతున్నారు ఈ నేపథ్యంలో ఆయా జాతర కమిటీల ఆధ్వర్యంలో పట్టణంలో వివిధ ప్రాంతాల్లో గంగమ్మ కొలువుదీరే మూల స్థానాలందు ప్రత్యేకంగా చలువ పందిళ్ళు వేసి విద్యుత్ దీపాలంకరణతో ముస్తాబు చేస్తున్నారు అలాగే అమ్మవారు కొలువుదీరిన ఏడు గంగమ్మల ఆలయాన్ని ఇప్పటికే స్వరాంగ సుందరంగా రంగులతో తీర్చిదిద్ది ఆకర్షనీయంగా విద్యుత్ దీపాలతో వెలుగులు నింపారు




