మోతే వాగు శివారులో తాటి ఈత చెట్లను తొలగించే ప్రయత్నాలను ఆపాలి

- Advertisement -

మోతే వాగు శివారులో తాటి ఈత చెట్లను తొలగించే ప్రయత్నాలను ఆపాలి

Attempts to remove palm trees in the suburbs of Mothe Wagu should be stopped

 కలెక్టర్ కు వినతిపత్రం ఇచ్చిన గౌడ సంఘం నాయకులు

జగిత్యాల డిసెంబర్ 9

జగిత్యాల జిల్లా మోతే గ్రామ శివారులోని వాగుకు ఆనుకొని ఉన్న తాటి ఈత చెట్లను తొలగించాలని ప్రయత్నిస్తున్నారని వాటిని కాపాడాలని తిమ్మాపూర్,మోతె గ్రామాల గౌడ సంఘం నాయకులు జగిత్యాల జిల్లా కలెక్టర్ కు సోమవారం వినతి పత్రం చేశారు. వినతి పత్రంలో తెలిపిన వివరాల ప్రకారం మోతే గ్రామ శివారులోని వాగుకు ఆనుకొని ఉన్న భూమిలో అధిక మొత్తంలో తాటి ఈత చెట్లు ఉన్నాయని, ఆ భూమి యజమాని వాగును మొరంతో నింపి కబ్జా చేసి గృహ నిర్మాణాలు చేపట్టేందుకు మోతే గ్రామపంచాయతీ అనుమతికి దరఖాస్తు చేసుకోగా గ్రామపంచాయతీ అధికారులు మోకాపై పరిశీలన జరగకుండానే అనుమతులు ఇచ్చినట్లు తెలిసిందని కనీసం సంబంధిత గౌడ సంఘం నాయకులకు సమాచారం ఇవ్వకుండా తాటి ఈత చెట్లను తొలగించే ప్రయత్నం చేస్తున్నారని తిమ్మాపూర్ మోతే గౌడ సంఘం నాయకులు పేర్కొన్నారు. తాటి ఈత చెట్లు తొలగించడం వల్ల గౌడ సంఘంలో ఉన్నటువంటి కల్లుగీత వృత్తిపై ఆధారపడి జీవిస్తున్న గౌడ కులస్తులు దాదాపు 150 మందికి పైగా జీవనోపాధి కోల్పోయి రోడ్డున పడే దుస్థితి నెలకొంటుందని తెలిపారు. ఈ విషయంపై సంబంధిత తహసిల్దార్ మోఖాపై పరిశీలన జరిపి న్యాయం చేసేలా చేయాలని అదేవిధంగా ఆబ్కారి శాఖ సూపరింటేండుకు ఆదేశాలు జారీ చేసి తాటి ఈత చెట్లను తొలగించే ప్రయత్నాన్ని విరమింప చేయాలని జిల్లా కలెక్టర్ ను కోరినట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో జగిత్యాల గౌడ సంఘం అధ్యక్షులు పంజాల తిరుపతి గౌడ్, మోతె అద్యక్షుడు పెరుమాండ్ల రామకృష్ణ గౌడ్, తిమ్మాపూర్ అద్యక్షుడు కాసారం కిషన్ గౌడ్, డైరెక్టర్ కోల కిషన్ గౌడ్, గౌడ సంఘం నాయకులు కొత్తకొండ అంజయ్య గౌడ్, పెరుమాండ్ల వెంకటరమణ గౌడ్, కాసారపు రాజా గౌడ్, నాగుల భాస్కర్ గౌడ్, నగేష్ గౌడ్, పర్ష రామ్ గౌడ్, కె మహేష్ గౌడ్, బుర్ర శివకుమార్ గౌడ్, పి శ్రీనివాస్ గౌడ్, సి హెచ్  ప్రవీణ్ గౌడ్, కె వీరమల్లు గౌడ్, రమేష్ గౌడ్, సురేష్ గౌడ్, దేవయ్య గౌడ్, పలువురు జగిత్యాల, తిమ్మాపూర్, మోతే గౌడ సంఘం నాయకులు పాల్గొన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular