మోడీ అండతో అదానీ అరాచకాలు..

- Advertisement -

మోడీ అండతో అదానీ అరాచకాలు..

Adani atrocities under Modi

అదాని చేతిలో కేంద్రం కీలుబొమ్మ..

అదాని విద్యుత్ ఒప్పందాలన్నింటినీ రద్దు చేయాలి
కడప ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటులో పాలకుల మోసం తగదు.

కడప ఆర్డీవో కార్యాలయం వద్ద  నిరసనలో సిపిఐ నగర కార్యదర్శి యన్. వెంకట శివ.

గౌతమ్ ఆదాని కంపెనీల ఏజెంట్ గా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్నదని,
అందుకే అదానీ విద్యుత్ కుంభకోణాలపై ప్రతిపక్ష పార్టీల ఎంపీలు జాయింట్ పార్లమెంట్ కమిటీ వేయాలని డిమాండ్ చేస్తున్నా మోడీ ప్రభుత్వం నిర్లక్ష్యంగా కాలయాపన చేస్తున్నదని సిపిఐ నగర కార్యదర్శి యన్.వెంకట శివ మండిపడ్డారు.

సోమవారం కడప ఆర్డీవో కార్యాలయం వద్ద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలకు  నిరసనగా సిపిఐ ఆందోళన చేపట్టింది.
కడపలో వెంటనే ఉక్కు ఫ్యాక్టరీ నిర్మించాలని, రాష్ట్రంలో పెంచిన విద్యుత్ ఛార్జీలను తగ్గించాలని, ఆదానీ-జగన్ ప్రభుత్వం  మధ్య జరిగిన విద్యుత్ ఒప్పందాలను రద్దు చేయాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.

ఈ సందర్భంగా సిపిఐ నగర కార్యదర్శి యన్. వెంకట శివ మాట్లాడుతూ విభజన చట్టంలోని కడప ఉక్కు ఫ్యాక్టరీ అంశం కేంద్ర ప్రభుత్వం ముందు లేదని నిసిగ్గుగా కేంద్ర ఉక్కు శాఖ మంత్రి  కుమారస్వామి పార్లమెంటులో ప్రకటించడం దారుణమన్నారు. ప్రభుత్వ రంగ సంస్థ సెయిల్ ఆధ్వర్యంలో కడప జిల్లా లో ఉక్కు ఫ్యాక్టరీ నిర్మిస్తామని రాష్ట్ర విభజన చట్టంలో  పొందుపరిచినప్పటికీ, కేంద్ర రాష్ట్ర పాలక ప్రభుత్వాలు నిర్దిష్ట హామీలు ఇచ్చినప్పటికీ ఇప్పటికీ పాలక ప్రభుత్వాలు చేస్తున్న మోసం అంతా ఇంతా కాదని ఆందోళన వ్యక్తం చేశారు. కడప ఉక్కు ఏర్పాటును విస్మరిస్తే బిజెపి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పతనం తప్పదన్నారు. రాష్ట్రంలో కూటమి  ప్రభుత్వం ఆరు నెలల పాలనలో విద్యుత్ ట్రూ అప్, సర్దుబాటు చార్జీల పేరుతో  రెండుసార్లు విద్యుత్ చార్జీలు పెంచి రాష్ట్ర ప్రజలపై 17 వేల కోట్ల విద్యుత్ భారాలు మోపిందని విమర్శించారు. వ్యవసాయ పంపు సెట్లకు , వ్యాపార వాణిజ్య, ఇళ్లకు విద్యుత్ స్మార్ట్ మీటర్లు బిగింపును ఉపసంహరించుకోవాలన్నారు.

ప్రధాని మోడీ పదేళ్ల పాలనలో దేశ సంపదనంతా అదానికి దోచిపెట్టిన నేపథ్యంలో ప్రపంచ కుబేరుల్లో మూడో స్థానం, ఆసియాలో నెంబర్ వన్ స్థానం దక్కించుకొని దేశ ప్రజలపై బారాలు మోపుతుండడం దారుణమన్నారు.అదానీపై అమెరికాలో కేసు నమోదైన నేపథ్యంలో పార్లమెంటును ,దేశాన్ని కుదిపేస్తున్న అదానీ విద్యుత్ మహా కుంభకోణంలో 1,750 కోట్ల రూపాయలు లంచాల చెల్లింపు జగన్ ప్రభుత్వ హయంలో జరిగిన నేపథ్యంలో ఈ విద్యుత్ ఒప్పందాలన్నింటినీ కూటమి ప్రభుత్వం రద్దు చేయాలన్నారు. రాష్ట్రంలో సౌర విద్యుత్ కేంద్రాలను    ప్రభుత్వమే చేపట్టి నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు,నాణ్యమైన చౌకైన విద్యుత్ ఉత్పత్తి చేయాలన్నారు.  అదానీ కుంభకోణాల వ్యవహారంపై సంయుక్త పార్లమెంటరీ కమిటీ  (జెపిసి) వేసి సహజ సంపదల దోపిడీ ద్వారా అదాని చీకటి సామ్రాజ్యంను వెలికితీయాలని
మోడీ అనుసరిస్తున్న ఈ కార్పొరేట్ విధానాలకు వ్యతిరేకంగా సిపిఐ దేశవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టిందన్నారు. మోడీ పదేళ్ల పాలనలో కార్పొరేట్ అదాని కంపెనీల ఆదాయం ప్రపంచం లోని ధనవంతుల్లో మూడో స్థానంలో నిలబెట్టిందని, దేశంలోని సహజ సంపాదనంతా ఆదానీ పరం చేశారని దుయ్యబట్టారు.రాష్ట్రంలో ఆదాని విద్యుత్ ఒప్పందాలను వెంటనే రద్దు చేసుకొని విద్యుత్ చార్జీలను తగ్గించాలని, లేకపోతే కూటమి ప్రభుత్వం మరో విద్యుత్ ఉద్యమాన్ని చవిచూడాల్సి వస్తోందని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు సి.సుబ్రహ్మణ్యం, నగర సహాయ కార్యదర్శులు కేసీ బాదుల్లా, ఉద్దె మద్దిలేటి, నగర కార్యవర్గ సభ్యులు సావంత్ సుధాకర్, పి మల్లికార్జున, గౌస్, లింగన్న, నాగిరెడ్డి, ఆచారమ్మ దేవి, యేసు రత్నం, ఓబులయ్య, నరసమ్మ, మునెమ్మ, పకీరప్ప, తిరుపాలు ,కృష్ణ, రాముడు, దస్తగిరమ్మ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular