చిరుద్యోగి నుంచి పెద్దల సభకు…సానా సతీష్ స్టోరీ…

- Advertisement -

చిరుద్యోగి నుంచి పెద్దల సభకు…సానా సతీష్ స్టోరీ…

From small jobber to Elders' Assembly...Sana Satish's Story...

కాకినాడ, డిసెంబర్ 11, (వాయిస్ టుడే)
టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు నాయుడిని కలిశారు ఆ పార్టీ అభ్యర్థి సానా సతీష్. పార్టీలో కార్యకర్తగా పనిచేస్తున్న తనను పెద్దలసభకు పంపిస్తుండడంపై సంతోషం వ్యక్తంచేశారు. పార్టీ అధినేతకు కృతజ్ఞతలు తెలిపారు. గత ఎన్నికల్లో కాకినాడ ఎంపీ టికెట్ ఆశించిన సానా సతీష్‌కు కూటమి సర్దుబాట్లలో భాగంగా చంద్రబాబు నాయుడు ఇవ్వలేకపోయారు. ఇప్పుడు రాజ్యసభకు సానా సతీష్‌ను పంపిస్తున్నారు. దీంతో భావోద్వేగానికి గురయ్యారు సానా సతీష్. రాష్ట్రాభివృద్ధిలో భాగస్వామిని అవుతానని, పార్టీ లైన్ ప్రకారం సభలో తన వాయిస్ బలంగా వినిపిస్తానని చెప్పారు. సానా సతీష్‌తో పాటు.. మరో ఇద్దరు రాజ్యసభ అభ్యర్థులు బీద మస్తాన్‌రావ్, ఆర్.కృష్ణయ్య కూడా చంద్రబాబును కలిశారు.కాకినాడ లోక్‌సభ టికెట్ ఆశించిన తెలుగుదేశం పార్టీ నాయకుడు సానా సతీష్ రాజ్యసభలో అడుగుపెట్టనున్నారు. గత ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేయాలని భావించిన సతీష్‌కు పొత్తుల లెక్కలు కలిసిరాలేదు. కాకినాడ ఎంపీ సీటు జనసేనకు దక్కడంతో ఆయన కూటమి విజయానికి కృషి చేసి పార్టీ పట్ల కమిట్‌మెంట్ చాటుకున్నారు. సానా సతీష్ ఇప్పుడు రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నిక అవ్వనుండటంతో ఆయన శిబిరంలో ఆనందోత్సాహాలు వెల్లివిరుస్తున్నాయి.కాకినాడకు చెందిన సానా సతీష్‌ను రాజ్యసభ అభ్యర్థిగా టీడీపీ ప్రకటించింది. గత ఎన్నికల్లో కాకినాడ ఎంపీ సీటు ఆశించినా అనూహ్య పరిణామాలతో ఆ స్థానాన్ని పిఠాపురం జనసేన నాయకుడు తంగెళ్ల ఉదయ్‌ శ్రీనివాస్‌కు కేటాయించారు. అయినా ఏ మాత్రం నిరాశపడని సతీష్ పార్టీ పట్ల కమిట్‌మెంట్‌తో ఎన్నికల్లో కూటమి విజయానికి కృషి చేశారు. వైసీపీ నుంచి టీడీపీలో చేరిన మాజీ రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణ స్థానాన్ని భర్తీచేసేందుకు టీడీపీ సానా సతీష్‌ను అభ్యర్థిగా ప్రకటించింది. రాజ్యసభకు నామినేషన్ వేసిన సానా సతీష్ ఏకగ్రీవంగా ఎన్నికవ్వనుండటంతో ఆయన శిబిరంలో ఆనందోత్సాహాలు వెల్లివిరుస్తున్నాయి.ఒక సామాన్యుడిగా మొదలైన సానా సతీష్ ప్రస్థానం కృషి, పట్టుదల, అకుంఠత దీక్షతో రాజ్యసభలో అడుగుపెట్టేలా చేసింది.. సానా సతీష్‌బాబు ఫౌండేషన్ వ్యవస్థాపకుడిగా కాకినాడ వాసులకు సుపరిచితుడైన ఆయన కాకినాడ రూరల్ నియోజకవర్గంలోని తమ్మవరంలో 1972 ఆగస్టు 19న జన్మించారు. తల్లిదండ్రులు సానా సుబ్బారావు, సత్యప్రభ.. ఆయనకు భార్య నాగజ్యోతి, ఇద్దరు పిల్లలు ఉన్నారు. పీఆర్‌ ప్రభుత్వ కళాశాలలో ఇంటర్,పాలిటెక్నిక్‌ డిప్లొమా చదివారు.తండ్రి విద్యుత్తు ఉద్యోగిగా పనిచేస్తూ మరణించడంతో సతీష్‌ కారుణ్య నియామకం కింద 1994లో అదే శాఖలో ఉద్యోగం పొందారు. అనంతరం బీటెక్‌ పూర్తిచేశారు. విద్యుత్తు శాఖ సబ్‌ ఇంజినీర్‌గా పనిచేస్తున్న సతీష్‌ 2005లో ఉద్యోగానికి రాజీనామా చేశారు. తర్వాత హైదరాబాద్‌ వెళ్లి వ్యాపారాలపై దృష్టిపెట్టారు. వాన్‌పిక్, మ్యాట్రిక్స్, మహాకల్ప ఇన్‌ఫ్రా తదితర 14 కంపెనీల్లోనూ డైరెక్టర్‌గా పనిచేశారు. స్థిరాస్తి వ్యాపారం, ఫుడ్‌ అండ్‌ బెవరేెజ్, సీపోర్టు, పవర్‌ అండ్‌ ఎనర్జీ రంగాల్లో రాణించారు.సతీష్‌బాబు చదువుకుంటున్న రోజుల్లో అండర్‌-15 కాకినాడ క్రికెట్‌ టీంకు ప్రాతినిధ్యం వహించారు. పదేళ్లపాటు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా క్రికెట్‌ అసోసియేషన్‌ కార్యదర్శిగా వ్యవహరించారు. బిజినెస్ రంగంలో తనదైన ముద్ర వేసిన ఆయన ప్రముఖ సినీ దర్శకుడు, రచయిత వంశీ పసలపూడి కథల పుస్తకాన్ని అచ్చువేయించి సాహిత్య రంగం పట్ల తన అనుభవాన్ని చాటుకున్నారు. సానా సతీష్‌ ఫౌండేషన్‌ ద్వారా పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ప్రస్తుతం ఆంధ్ర క్రికెట్‌ ఆసోసియేషన్‌ కార్యదర్శిగా ఉన్న ఆయన ఇప్పుడు స్వయం కృషితో ఎదిగి రాజ్యసభలో అడుగు పెట్టనున్నారు.
సానాకు చానా చరిత్ర
సానా సామాన్యుడు కాదు.. చానా చరిత్ర ఉంది అని ఎందుకు చెప్పాం అంటే ఆయన బ్యాక్ గ్రౌండ్ అలాంటిది మరి.. ఒక సామాన్య ఉద్యోగిగా ఉండి.. కోట్ల రూపాయల సామ్రాజ్యం నిర్మించడం మాత్రమే కాదు.. సీబీఐ, ఈడీ కేసుల్లోనూ ఆయన పేరు మారుమోగింది. ఏకంగా ఇద్దరు సీబీఐ డైరక్టర్ల మధ్య గొడవే రగిల్చింది. మనీలాండరింగ్ కేసుల్లో ఈడీ ఆయన్ను అరెస్టు చేసింది. 2017లో సంచలనం సృష్టించిన మీట్ ఎక్స్‌పోర్టర్ మెయిన్ ఖురేషీ కేసులో మెయిన్ పాత్రదారి సానా సతీష్. మనీ లాండరింగ్ చేశారని ఆయన్ను అప్పుడు ఈడీ అదుపులోకి తీసుకుంది. అప్పట్లో సతీష్ ఇచ్చిన స్టేట్‌మెంట్ సీబీఐలో కుంపట్లు రాజేసింది. ఏకంగా ఆ సంస్థ స్పెషల్ డైరక్టర్ రాకేష్ ఆస్థానాపై కేసు నమోదైంది. అప్పటి డైరక్టర్ ఆలోక్ వర్మ పదవి ఊడిపోయింది.  ప్రత్యేక డైరక్టర్, చాలా మంది సీనియర్ అధికారులకు స్థానచలనం కలిగింది. మెయిన్ ఖురేషీ కేసులో సతీష్ ను విచారణకు పిలిచి వేధించకుండా ఉండేందుకు అప్పటి స్పెషల్ డైరక్టర్ రాకేష్ ఆస్థానాకు డబ్బులు ఇచ్చినట్లుగా సతీష్ చెప్పినట్లు ఆరోపణలు వచ్చాయి. దాని ఆధారంగానే రాకేష్ పై సీబీఐ కేసు నమోదు చేసింది. 2017 అక్టోబర్ , నవంబర్ లో ప్రతీవారం విచారణకు రావలసిందిగా సీబీఐ సమన్లు పంపింది. అయితే భవిష్యత్‌లో విచారణ పేరుతో వేధించకుండా ఉండేందుకు ఐదు కోట్లు చెల్లించేందుకు ఒప్పందం కుదురిందని మూడు కోట్లు సీబీఐ అధికారులకు ముడుపుల రూపంలో ఇచ్చారని సతీష్ చెప్పినట్లు వార్తలు వచ్చాయి. ఈ విషయం  బయటకు వచ్చాక రాకేష్‌పై కేసు నమోదైంది. ఆ తర్వాత ఆయన.. మిగిలిన రెండుకోట్లు డైరక్టర్ అలోక్ వర్మకు ఇస్తున్నారని ఆరోపణలు చేశారు. దీంతో డైరక్టర్ – స్పెషల్ డైరక్టర్ మధ్య యుద్ధమే జరిగింది. ఈ దెబ్బతో ప్రభుత్వం ఇద్దరినీ తొలగించి.. మన్నెం నాగేశ్వరరావును డైరక్టర్‌గా నియమించింది. ఆ కేసు ఇప్పటికీ కొనసాగుతోంది.
పవన్‌తో పోటీ – అప్పుడు ఓటమి ఇప్పుడు గెలుపు
చంద్రబాబు స్కిల్ కేసులో అరెస్టైనప్పుడు.. తూర్పుగోదావరి జిల్లాలో తెలుగుదేశం కార్యక్రమాల నిర్వహణకు సతీష్ ఆర్థికంగా అండగా నిలబడ్డారని.. ఆ కారణంతో ఆయన ఎన్నికలకు ముందు కాకినాడ లోక్‌సభ టికెట్ కోసం ప్రయత్నించారని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. అయితే కాకినాడ టికెట్‌ను పవన్ తన సన్నిహితుడైన ఉదయ్‌కు ఇప్పించే విషయంలో చాలా పట్టుదలగా వ్యవహరించారు. దీంతో సానాకు టికెట్ దక్కలేదు. అప్పుడు పవన్ కారణంగా ఆయనకు చేదు అనుభవం ఎదురైంది. ఈసారి రాజ్యసభ విషయంలో మళ్లీ పవన్ కల్యాన్‌ను ఫేస్ చేయాల్సి వచ్చింది. . టీడీపీ నుంచి సానా సతీష్, జనసేన నుంచి పవన్ కల్యాన్ సోదరుడు నాగబాబు పోటీకి వచ్చారు. ఈ సారి సానా సతీష్ తన అభ్యర్థిత్వం విషయంలో గట్టిగా నిలబడటంతో ఆయనకు టికెట్ ఇచ్చి.. పవన్ ను శాంతింపజేయడం కోసం చంద్రబాబు నాగబాబును మంత్రివర్గంలోకి తీసుకోవలసి వచ్చింది.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular