అన్నదాతను నట్టేటా ముంచిన కూటమి ప్రభుత్వం

- Advertisement -

అన్నదాతను నట్టేటా ముంచిన కూటమి ప్రభుత్వం

This is the greedy government that has made the Farmers miserable

ఈ నెల 13న  కలెక్టర్ కార్యాలయం ముందు నిరసన కార్యక్రమం
పోస్టర్లు విడుదల చేసిన ఎమ్మిగనూరు వైకాపా ఇంచార్జ్ బుట్టా రేణుక
ఎమ్మిగనూరు డిసెంబర్ 11
ఎమ్మిగనూరు నియోజకవర్గ వైయస్ఆర్ సిపి ఇంచార్జ్  బుట్టా రేణుక అన్నదాతను నట్టేటా ముంచిన కూటమి” ప్రభుత్వంపై రైతులతో కలసి రాష్ట్ర వ్యాప్తంగా వైయస్ఆర్ సీపీ 13.12.2024 తేదీన కలెక్టర్ల కార్యాలయాల ముందు తలపెట్టిన నిరసన కార్యక్రమం పోస్టర్లను విడుదల చేశారు.
బుట్టా రేణుక  మాట్లాడుతూ అన్నదాతా సుఖీభవ అంటూ ఏడాదికి రూ.20వేలు ఇస్తామంటూ రైతులతో ఓట్లేయించుకుని వారిని దగాచేసి పచ్చి మోసం చేసిందని అన్నారు. ఖరీఫ్ ముగిసింది, రబీ వచ్చింది అయినా అన్నదాత సుఖీభవ పెట్టుబడి సహాయం అందక రైతులు గగ్గోలు పెడుతున్న బడ్జెట్లో రూ.10,700 కోట్లు పెట్టాల్సి ఉండగా దాని ప్రస్తావనే లేదని అన్నారు.
జగనన్న హయాంలో ఏటా క్రమం తప్పకుండా డా” వైయస్సార్ రైతు భరోసా కింద మేనిఫెస్టోలో  ఏడాది రూ.12,500 పెట్టింది కాని మరో వేయి పెంచి  ఏడాదికి రూ.13,500 చెప్పిన దానికంటే మిన్నగా  ఐదేళ్లలో 53.52లక్షల మందికి రూ.34,288 కోట్ల పెట్టుబడి సహాయం ఇచ్చి గొప్పగా జగనన్న అమలు చేశారని అన్నారు.
జగన్ హయాంలో 75 కేజీల బస్తా కనీస మద్దతు ధర రూ.1725లు కాని బాబు పాలనలో రూ.1300ల లోపే రూ.400ల మేర నష్టపోతున్న రైతులు, ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో దళారీల సిండికేట్గా మారి రైతులను దోచుకుంటున్నారని ఆరోపించారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular