- Advertisement -
ఎం.ఎస్.ఎం.ఈ. సర్వే ను పరిశీలించిన కమిషనర్ ఎన్.మౌర్య
MSME Commissioner N. Maurya inspected the surveyతిరుపతి,
తిరుపతి నగరంలో జరుగుతున్న చిన్న, మధ్యతరగతి పరిశ్రమల ఆన్లైన్ నమోదు ప్రక్రియను నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్.మౌర్య పరిశీలించారు. బుధవారం మధ్యాహ్నం బాలాజి కాలని, టౌన్ క్లబ్ తదితర ప్రాంతాల్లో సచివాలయం కార్యదర్శులు నిర్వహిస్తున్న ఈ నమోదు ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ప్రభుత్వం ప్రవేశపెట్టిన “ఉద్యమ్” అనే పోర్టల్ ద్వారా చిన్న, మధ్య తరగతి పరిశ్రమల నిర్వాహకులు తమ వివరాలు నమోదు చేసుకోవాలని అన్నారు. ఉద్యమ్ పోర్టల్ నందు మీ వివరాలను నమోదు చేసుకోవడం వలన వివిధ చిన్న, మధ్య తరగతి ప్రభుత్వ పథకాలు, రాయితీలు సులభంగా పొందవచ్చు అన్నారు. మీ యొక్క పరిశ్రమల నిర్వహణ సులభతరం అవుతుందని అన్నారు. తక్కువ వడ్డీ రేట్లకు రుణాలు సులభంగా పొందేందుకు వీలుంటుందని, ప్రభుత్వ టెండర్లకు అర్హత పొందవచ్చునని అన్నారు. అలాగే తక్కువ విద్యుత్ బిల్లులు, పన్నులు నమోదు అవుతాయని అన్నారు. ఈ ఉద్యమ్ నమోదు కొరకు మీ ఆధార్ కార్డు, యజమానులు, భాగస్వాములు, డైరెక్టర్లు, పని చేస్తున్నవారు, పాన్ కార్డ్, మీ పరిశ్రమ పేరు, మీ బ్యాంక్ ఖాతా నెంబరు తదితర వివరాలను అందించాల్సి ఉంటుందని అన్నారు. ఈ సర్వే నిర్వహిస్తున్న తమ సచివాలయం కార్యదర్శులకు చిన్న, మధ్య తరగతి పరిశ్రమల యజమానులు సహకరించాలని అన్నారు. ఉద్యమ్ పోర్టల్ నమోదు ప్రక్రియ వలన కలిగే లాభాలను వారికి చెప్పి, ఆన్లైన్లో వారి వివరాలు నమోదు చేయాలని కార్యదర్శులను కమిషనర్ ఆదేశించారు. కమిషనర్ వెంట డి.ఈ. మధు బాబు, సచివాలయం కార్యదర్శులు సురేష్, లోకేష్, తదితరులు ఉన్నారు.
- Advertisement -




