వైభవంగా ఏడు గంగమ్మల జాతర
A glorious fair of Yedu Gangammasశ్రీకాళహస్తి డిసెంబర్ 11
ఏడు గంగమ్మల జాతర బుధవారం అంగరంగ వైభవంగా జరిగింది. జాతర సందర్భంగా మొక్కులు తీర్చు కొనుటకు పట్టణంలోని భక్తులే కాకుండా చుట్టుపక్కల గ్రామాల నుంచి తండోప తండాలుగా కదలి వచ్చారు. నెల్లూరు జిల్లా వెంకటగిరి,నాయుడుపేట, సూళ్లూరుపేట తడ నుంచి వేలాదిమంది కదిలి వచ్చారు. జాతర సందర్భంగా కమిటీ నిర్వాహకులు పోటీలు పడి అలంకారాలు జరిపారు దీంతో భక్తులు అమ్మవారి శోభను తిలకించేందుకు వెయ్యి కళ్లు అయినా చాలదన్నట్లు ఆకట్టుకుంది సర్పరాలు మండపాలు అమ్మవార్ల అలంకారాలు ఒకరిని మించి మరొకరు చేపట్టారు జాతర సందర్భంగా గతంలో కన్నా అధిక సంఖ్యలో జంతుబలి చోటు చేసుకుంది ముందస్తు ప్రణాళికతో డి వై ఎస్ పి నరసింహమూర్తి సీఐ గోపి ఎస్సైలు ట్రాఫిక్ పోలీసులు పకడ్పల్లి చర్యలు చేపట్టారు పెండ్లి మండపం పొన్నాలమ్మ, శ్రీ శివశక్తి ప్రభ,అలంకరణ సింహ వాహనంపై ఆది పరాశక్తి అలంకారం, భేరి వారి మండపం వద్ద గంగమ్మను ముత్యాలమ్మ అంటారు. శ్రీ వీర లక్ష్మీదేవి అలంకారం, పద్మ ప్రభ, మయూర వాహనం, పూసల వీధి గంగమ్మ, శ్రీ బాల త్రిపుర సుందరీ దేవి అలంకారం నవ దుర్గాదేవి, సప్తశక్తి, అష్ట శక్తి లక్ష్మి దేవతల ప్రభా 40 శక్తుల సంయుక్త ఏక వేదికపై ప్రభలు, సన్నిధి వీధి గౌరీ దేవి అలంకారం, శివశక్తి పుష్ప ప్రభ వాహనం, బాపన వీధి గంగమ్మ కామాక్షి దీప ప్రభ గాయత్రీ దేవి అలంకారం, గాంధీ వీధి గంగమ్మ మయూర మండపం చండీ దేవి మూర్తి, కొత్తపేట గంగమ్మ భువనేశ్వరి దేవి సూర్యప్రభ సప్త అశ్వ వాహానాలుగా తీర్చిదిద్దారు




