అవసరానికి వైకాపాను వాడుకున్న అవంతి శ్రీనివాస్

- Advertisement -

అవసరానికి వైకాపాను వాడుకున్న అవంతి శ్రీనివాస్

Avanti Srinivas who used Vaikapa for necessity

విశాఖపట్నం
మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ తన అవసరానికి పార్టీని వాడుకొని అవసరం తీరాక పార్టీ నుండి వెళ్లిపోయాడని మాజీ మంత్రి, విశాఖ జిల్లా వైసీపీ అధ్య క్షుడు గుడివాడ అమర్నాథ్ అన్నా రు. అవంతి శ్రీనివాస్ పార్టీ నుండి వెళ్లిపోవడం వల్ల వచ్చిన నష్టం లేదు అలాగే లాభం కూడా లేదని విమర్శించారు. రైతులు పడుతున్న ఇబ్బందులపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పిలుపుమేరకు నేడు రాష్ట్ర వ్యాప్తంగా వైసిపి నాయకులు జిల్లా కలెక్టర్లకు వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. అందులో భాగంగానే విశాఖ నగరంలోని మాజీ మంత్రి, జిల్లా వైసీపీ అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ ఆధ్వర్యంలో జిల్లా పరి షత్ జంక్షన్ నుండి కలెక్టర్ కార్యా లయం వరకు ర్యాలీ నిర్వహించి అనంతరం జిల్లా అధికారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అనంత రం మాజీ మంత్రి గుడివాడ అమ ర్నాథ్ మాట్లాడుతూ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ముందుగా చెప్పినట్టే ప్రభుత్వానికి ఆరు నెలల సమయం ఇచ్చి ఇప్పుడు ప్రజా సమస్యలపై పోరాడేందుకు సిద్ధమైందన్నారు. కూటమి ప్రభుత్వం ఈ ఆరు నెలలు రెడ్బుక్ రాజ్యాంగం అమలు చేయ డం తప్ప మరి ఒక కార్యక్రమం చేయలేదని విమర్శించారు. ప్రభుత్వం ఏర్పాటుకు ముందు ఆరు హామీలు ఇచ్చి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత డక్ అవుట్ అయిందని ఎద్దేవా చేశారు. నేడు విశాఖలో జరిగిన ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున జిల్లా నేతలు పాల్గొన్నా రు. అయితే కార్యక్రమంలో పాల్గొన్న నేతలతో పాటు కార్యకర్తలు కూడా కలెక్టరేట్లోకి చొచ్చుకు  వెళ్లేందుకు ప్రయత్నించడంతో కార్యాలయం బయట పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే చింతలపూడి వెంకటరామయ్యకు గాయమైంది….

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular