- Advertisement -
ట్రినిటీ ఇంజనీరింగ్ లో ప్లేస్ మెంట్ ఫర్ రెడీనెస్ ప్రోగ్రాం
Placement for Readiness Program in Trinity Engineeringపెద్దపల్లి ప్రతినిధి:
పట్టణంలోని స్థానిక ట్రినిటీ ఇంజనీరింగ్ కళాశాలలో తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్ ఆధ్వర్యంలో “మెంటార్ టుగెదర్ ఆర్గనైజేషన్” సహకారంతో బీటెక్ మూడవ, నాలుగవ సంవత్సరం చదువుతున్న మహిళా విద్యార్థులకు “మెంటార్ టుగెదర్ ఫర్ ప్లేస్మెంట్ రెడీనెస్” అనే కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జూనియర్ ప్రోగ్రాం అసోసియేట్ మెంటార్ టు గెదర్ ఆర్గనైజేషన్ ప్రతినిధి స్వాతి పాల్గొని విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా కళాశాల అకాడమిక్ డైరెక్టర్ డాక్టర్ అశోక్ కుమార్, ప్రిన్సిపల్ డాక్టర్ మణి గణేష్ మాట్లాడుతూ విద్యార్థులందరికి ప్రముఖ బహుళ జాతీయ కంపెనీలో పనిచేస్తున్న 60 కంపెనీల ప్రతినిధులు, ఎంప్లాయిస్ ముగ్గురు విద్యార్థులకి ఒక మెంటార్ గా వ్యవహరిస్తూ వారికి నాలుగు నెలల పాటు ఆన్లైన్ ద్వారా 16 సెషన్స్ నిర్వహించి ఈ సెషన్స్ లో టెక్నికల్ స్కిల్స్, రెస్యూమ్ రైటింగ్, సాఫ్ట్వేర్ నాలెడ్జ్, అప్డేటెడ్ నాలెడ్జ్, కమ్యూనికేషన్ స్కిల్స్, ప్రోగ్రామింగ్ నాలెడ్జ్, ప్రాబ్లం సాల్వింగ్ వంటి అంశాలపై విద్యార్థులకు క్షుణ్ణంగా వివరించినట్లు తెలిపారు. అలాగే ట్రైనింగ్ అందించి అనంతరం వారికి కోర్స్ కంప్లేషన్ సర్టిఫికెట్ మంజూరు చేసి తద్వారా వారు రానున్న కాలంలో ఉద్యోగ అవకాశాలు పొందడం కొరకు ఈ కార్యక్రమం దోహదపడుతుందని అంతేకాకుండా టాస్క్, వారి అనుసంధానం అయిన కంపెనీలు ప్లేస్మెంట్ డ్రైవ్ నిర్వహించిన ఈ కోర్స్ కంప్లీట్ చేసిన విద్యార్థులకి మొదటి ప్రాధాన్యత అందజేసి వారికి ఉద్యోగ అవకాశాలు పొందడం కొరకు సహకరిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో అకాడమిక్ డైరెక్టర్ డాక్టర్ అశోక్ కుమార్, ప్రిన్సిపల్ డాక్టర్ మణి గణేష్ , ఏఓ సురేష్, టాస్క్ కళాశాల కోఆర్డినేటర్ మధు శేఖర్, రిసోర్స్ పర్సన్ ఏ స్వాతి, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -




