- Advertisement -
నాగబాబు మంత్రి పదవికి స్మాల్ బ్రేక్
Small break for Nagababu's ministerial position
ఏలూరు, డిసెంబర్ 14, (వాయిస్ టుడే)
ఆలస్యం అమృతం విషం అంటారు. కొన్ని విషయాల్లో వెనువెంటనే పరిణామాలు జరిగితేనే సత్ఫలితాలు ఇస్తాయి. ఆలస్యం అయితే అనేక రకాల ఇబ్బందులు ఎదురవుతాయి. ఇప్పుడు మెగా బ్రదర్ నాగబాబు విషయంలో అదే జరుగుతోందన్న అనుమానం ఉంది.ఏపీలో ఆసక్తికర రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కూటమి అధికారంలోకి వచ్చి ఆరు నెలలు అవుతోంది. అదే సమయంలో వైసీపీ పోరుబాట పట్టింది. ప్రభుత్వ వైఫల్యాలపై రాష్ట్రవ్యాప్త నిరసనకు ఆ పార్టీ పిలుపునిచ్చింది. సరిగ్గా ఇదే సమయంలో రాష్ట్ర క్యాబినెట్లోకి మెగా బ్రదర్ నాగబాబును తీసుకుంటున్నట్లు చంద్రబాబు ప్రకటించారు. అయితే దీనిపై కూటమిలోనే భిన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. విపక్షంలో ఉన్నప్పుడు కుటుంబ రాజకీయాలపై ఎక్కువగా మాట్లాడారు పవన్ కళ్యాణ్. ఇప్పుడు ఒకే కుటుంబానికి అన్ని పదవులా అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఈ తరుణంలో ఇంతవరకు నాగబాబు కు మంత్రి పదవి అన్న విషయంలో పవన్ కళ్యాణ్ స్పందించలేదు. దీంతో రకరకాల అనుమానాలు ప్రారంభం అయ్యాయి. సోషల్ మీడియాలో సైతం దీనిపై పెద్ద ఎత్తున ప్రచారం నడుస్తోంది. అవి రకరకాల సందేహాలకు కారణమవుతున్నాయి. ముఖ్యంగా దీనిని వైసిపి ప్రచారాస్త్రంగా మార్చుకుంటుంది.నారా కుటుంబానికి రెండు పదవులు ఉన్నాయి . రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు వ్యవహరిస్తున్నారు. మంత్రిగా నారా లోకేష్ ఉన్నారు. మరోవైపు మెగా కుటుంబం నుంచి డిప్యూటీ సీఎం గా పవన్ కళ్యాణ్ ఉన్నారు. ఇప్పుడు మంత్రిగా మెగా బ్రదర్ నాగబాబును తెస్తే.. రెండు కుటుంబాలే ప్రభుత్వాన్ని పంచుకుంటున్నాయి అన్న విమర్శ రాక మానదు. ఇప్పటికే వైసీపీ నేతలు కూటమి ప్రభుత్వాన్ని మల్టీ స్టార్ గవర్నమెంట్ గా చెబుతున్నారు. అయితే ప్రభుత్వంలో నారా తో పాటు కొణిదల కుటుంబానికి ప్రాధాన్యం దక్కుతోంది. కానీ నందమూరి కుటుంబానికి చాన్స్ లేకుండా పోయిందన్న విమర్శ ఉంది.ఇంకోవైపు జనసేనలో సైతం మరోరకమైన విమర్శ ఉంది. జనసేన ఎన్నికల్లో 21 అసెంబ్లీ స్థానాల్లో విజయం సాధించింది. మూడు మంత్రి పదవులను సొంతం చేసుకుంది. అయితే మంత్రులు ముగ్గురు అగ్రకులాలకు చెందిన వారే. అందులో ఇద్దరూ కాపు సామాజిక వర్గానికి చెందినవారు. మిగతా ఒకరు కమ్మ సామాజిక వర్గం. దీంతో బీసీలకు కనీస ప్రాతినిధ్యం లేకుండా పోయింది అన్న విమర్శ ఉంది. ఇప్పుడు జనసేనకు లభిస్తున్న ఆ ఒక్క మంత్రి పదవి బీసీలకు ఇస్తే బాగుంటుందన్న అభిప్రాయం పార్టీ నుంచి వ్యక్తం అవుతోంది. ఈ పరిణామాల నడుమ నాగబాబు మంత్రి కావడం అనుమానంగా కనిపిస్తోంది. అయితే సాక్షాత్ సీఎం చంద్రబాబు ప్రకటించిన తర్వాత ఈ విషయంలో వెనక్కి తగ్గే పరిస్థితి లేదని తెలుస్తోంది. కానీ ఒక రకమైన అనుమానం మాత్రం వెంటాడుతోంది.
- Advertisement -