Saturday, December 14, 2024

గత 10 సంవత్సరాలుగా విద్యా వ్యవస్థ నిర్వీర్యం అయింది-మంత్రి పొన్నం

- Advertisement -

గత 10 సంవత్సరాలుగా విద్యా వ్యవస్థ నిర్వీర్యం అయింది-మంత్రి పొన్నం

Education system has become weak in last 10 years - Minister Ponnam

హైదరాబాద్
సాంఘిక సంక్షేమ పాఠశాల సెంటర్ ఆఫ్ ఎక్స్ లెన్స్ (బాయ్స్) షేక్ పెట్ లో మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటించారు. సంక్షేమ పాఠశాల లో లైబ్రరీ నీ కంప్యూటర్ ల్యాబ్ లో అందుతున్న కోర్స్ లను.డిజిటల్ క్లాస్ రూం  ద్వారా విద్యార్థులకు అందే ప్రత్యేక కోర్సులు తదితర వాటిని పరిశీలించారు.
గురుకుల పాఠశాలలో కామన్ డైట్ మెనూ ను ప్రారంభించారు.
కొత్త డైట్ ప్రారంభం అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేసారు.
మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పక్షాన సంవత్సర కాలం పూర్తి చేసుకున్న సందర్భంగా గురుకులాల్లో చదువుతున్న ఎస్సి ఎస్టీ బీసీ మైనారిటీ హాస్టల్ లలో బలమైన ఆహారాన్ని అందించడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ,ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క  మంత్రులు ,ఎమ్మెల్యేలు ఈరోజు హాస్టల్ లలో సందర్శిస్తున్నారు.
గురుకులాల్లో చదువుతున్న 8 లక్షల మంది బలమైన ఆహారం అందించాలని నిపుణులైన డాక్టర్ ల సమక్షంలో డైట్ మెనూ ఏర్పాటు చేసుకుంటున్నాం. ప్రభుత్వం గురుకులాల్లో తల్లిదండ్రులను భావించి మా భవిష్యత్ మీద అని అభయమిచ్చి ఇక్కడ చేరిన వారికి తెలంగాణ ప్రభుత్వం భరోసా కల్పిస్తున్నాం. గత 10 సంవత్సరాలుగా విద్యా వ్యవస్థ నిర్వీర్యం అయింది. ఉపాధ్యాయులకు ప్రమోషన్ లు ఇచ్చి బదిలీలు చేసి నియామకాలు చేపట్టి అధ్యాపకవర్గ అసహనాన్ని తొలగించం. ఎక్కడైనా నిర్లక్ష్యం జరిగితే సహించేది లేదని హెచ్చరించారు.

అమ్మ ఆదర్శ పాఠశాలల ద్వారా 25 వేల పాఠశాలకు 11 వందల కోట్లతో మౌలిక సదుపాయాలు కల్పించాం. పుస్తకాలు డ్రెస్ లు సమయానికి అందిస్తున్నాం. ఇప్పుడున్న ధరలను పోలిస్తే 40 శాతం డైట్ చార్జీలు 200 శాతం కాస్మొటిక్ చార్జీలు పెంచాం. గతంలో కిరాయిల ఇవ్వలేదని గురుకుల అద్దె భవనాలు ఖాళీ చేసే పరిస్థితి ఉంటే అద్దె బిల్లులు చెల్లించాం. మెస్ ఛార్జీలు గ్రీన్ ఛానెల్ ద్వారా చెల్లిస్తాం. రాబోయే కాలంలో ఆరోగ్యంగా ఉంటూ మానసికంగా బలంగా ఉంటూ తెలంగాణ అభివృద్ధిలో మీరంతా భాగస్వామ్యం కావాలి. జూడో ,చేస్ లో ఇక్కడ ఎక్కువగా ఆడుతున్నారు. మేము ప్రభుత్వ పాఠశాలలో చదువుకొని అకుంఠిత దీక్షతో చదువుకొని మీముందు మంత్రిగా ఇక్కడ ఉన్నా. ముఖ్యమంత్రి  ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నారు. మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి, టీజీపిఎస్సీ  చైర్మన్ బుర్ర వెంకటేశం,  ,ఫైనాన్స్ సెక్రెటరీ రామకృష్ణ గురుకులాల్లో చదివి ఇక్కడికి ఎదిగారని అన్నారు.
జవహర్ లాల్ నెహ్రూ నవ రత్నాలు స్థాపించి టెక్నికల్ గా దేశం ఎక్కడికో ఎదిగింది. మీరు మీ తెలివి నీ మెరుగుపరుచుకోవలి. కరీంనగర్ లోక్ సభ ఆశీర్వాదంతో పార్లమెంటు సభ్యుడుగా తెలంగాణ కోసం కొట్లాడి తెలంగాణ సాధించుకున్నాం. మీ తల్లిదండ్రులకు గ్రామానికి తెలంగాణ కి పేరు తెచ్చే విధంగా మీరు ఎదగాలి. మీకు మున్సిపల్ వాటర్ రేపటి నుండి ఉచితంగా వస్తాయి. ఈ గురుకుల లో ఒక బోర్ వేసి వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేస్తం. మౌళిక వసతులు కల్పనలు 25 లక్షలు మంజూరు చేస్తున్నాం. 20 మంది జూడో క్రీడాకారులకు జూడో డ్రెస్ లు కలెక్టర్ ఆధ్వర్యంలో అందిస్తున్నాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  ఆధ్వర్యంలో యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ వస్తుందని అన్నారు. ఈ స్కూల్ నుండి అక్కడ కూడా పెద్ద ఎత్తున సీట్లు సంపాదించాలి. నేను సౌత్ కొరియా  పోయినప్పుడు అక్కడ స్పోర్ట్స్ యూనివర్సిటీ చూసా . ఆ చిన్న దేశానికి  34 ఒలంపిక్స్ మెడల్స్ వచ్చాయి. తెలంగాణ రోడ్డు ప్రమాదాల వల్ల మరణాలు పెరుగుతున్నాయి. నెల రోజుల్లో ఇక్కడ ట్రాఫిక్ అవేర్నెస్ పార్క్ ఏర్పాటు చేస్తున్నాం.. విద్యార్థులకు రోడ్డు నిబంధనల పై అవగాహన కల్పిస్తాం. రవాణా నిబంధనలు పాటించాలి. రాబోయే కాలంలో రవాణా నిబంధనలపై కఠినంగా వ్యవహరిస్తమని అన్నారు.
తల్లిదండ్రులకు విజ్ఞప్తి ఇది ప్రజాస్వామ్య ప్రభుత్వం మీరు చెప్పింది కూడా వింటాం. ప్రభుత్వం రాగానే 2 లక్షల రూపాయల రుణమాఫీ చేశాం.. 200 యూనిట్ల ఉచిత విద్యుత్,500 కి గ్యాస్ అందిస్తున్నాం. ఇప్పటి వరకూ 120 కోట్ల మంది మహిళలు ఉచితంగా ప్రయాణం చేశారు. నియోజకవర్గానికి 3500 ఇందిరమ్మ ఇళ్లు ఇస్తున్నాం.. కొత్త రేషన్ కార్డులు ఇస్తున్నాం. గతంలో మీరు ఎప్పుడైనా పిల్లలతో కలిసి భోజనం చేశారా…? వారి సమస్యలు పరిష్కారం చేశారా…? ఇప్పుడు విద్యార్థుల మీద రాజకీయాలు చేస్తున్నారా. మీకు అండగా ఉంటాం.. మీ సమస్యలు పరిష్కారం చేస్తున్నాం. మీరు మంచిగా చదువుకొని మంచి పేరు సాధించాలని అన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్