- Advertisement -
ఆపోలో ఆస్పత్రిలో చేరిన ఆడ్వాణీ.. నిలకడగా ఆరోగ్య పరిస్థితి
Advani, who was admitted to Apollo Hospital, is in a stable health condition
న్యూ ఢిల్లీ డిసెంబర్ 14
బిజెపి నేత సీనియర్ నేత మాజీ ఉప ప్రధాని లాల్ కృష్ణా ఆడ్వాణీ(97) అస్వస్థతకు గురయ్యారు. ఆడ్వాణీని ఆపోలో ఆస్పత్రిలో చేర్పించారు. ఆయన పరిస్థితి నిలకడగా ఉందని న్యూరాలజీ డాక్టర్ వినిత్ సూరి తెలిపారు. గత ఆరు నెలల క్రితం అనారోగ్య సమస్యలతో ఎయిమ్స్ ఆస్పత్రిలో అడ్వాణీ చేరిన విషయం తెలిసిందే. వయసు పైబడడంతో ఆడ్వాణీకి అనారోగ్య సమస్యలు ఉన్నాయని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి.
- Advertisement -