రాష్ట్రాల హక్కులు హరిస్తున్న కేంద్రం
A center where the rights of the states are eroding
కార్మిక, కర్షక సంఘాల నిరసన
నంద్యాల
కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి రాష్ట్రాలకు ఇవ్వాల్సిన నిధుల వాటాను ఇవ్వకుండా కేంద్రం నుండి అందించాల్సిన సంక్షేమ పథకాల నిధులను కూడా ఇవ్వకుండా కోత విధించి దుర్మార్గమైన విధానాలను అనుసరిస్తుందని రాజ్యాంగానికి వ్యతిరేకంగా అనుకూలమైన ప్రభుత్వాలకు నిధులు ఇస్తూ వ్యతిరేక ప్రభుత్వాల పైన కక్ష సాధింపు చర్యలు చేయడం దుర్మార్గమని సిఐటియు, రైతు, వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో సిఐటియు కార్యాలయం నుండి ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి వరకు ప్లక్కార్డులు చేతపట్టుకుని అనంతరం జనరల్ ఆసుపత్రి వద్ద నిరసన కార్యక్రమం తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఏ నాగరాజు రైతు సంఘం జిల్లా కార్యదర్శి ఏ రాజశేఖర్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు నరసింహ నాయక్ వీరితో పాటు రైతు కార్మిక సంఘాల నాయకులు తోటమద్దులు, లక్ష్మణ్, వేన్న బాల వెంకటేష్, రామేశ్వరరావు, వెంకటేశ్వరరావు, సుబ్బరాయుడు లతోపాటు మరికొంతమంది పాల్గొనడం జరిగింది.