- Advertisement -
అనైతిక కార్యక్రమాలకు అడ్డాగా మూసీ రివర్ బెడ్ కూల్చివేత శిధిలాలు
Demolition debris in the Musi river bed as a barrier to unethical activities
స్లాబ్ లు కూల్చి, గోడలు అసంపూర్తిగా వదిలిన అధికారులు
రాత్రిపూట గాంజా, మద్యం వంటి ఇల్లీగల్ కార్యక్రమాలకు ఆవాసాలు
హైదరాబాద్
చాదర్ ఘాట్ మూసా నగర్, శంకర్ నగర్ మూసీ రివర్ బెడ్ లో కూల్చి వేసిన ఇండ్ల శిధిలాలు అనైతిక కార్యక్రమాలకు అడ్డాగా మారాయని,రాత్రిపూట గాంజా, మద్యం వంటి ఇల్లీగల్ కార్యక్రమాలకు వీటిని ఆవాసాలుగా చేసుకున్నరని స్థానికులు ఆరోపిస్తున్నారు. రాత్రుళ్ళు ఈ ప్రాంతాల్లో మద్యం,గాంజా సేవించి కొందరు పోకిరీలు స్థానికులను బయకంపితులను చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.ప్రభుత్వం ఈ ప్రాంతంలో మూసీ రివర్ బెడ్ ఇండ్ల కూల్చివేత ప్రక్రియను పూర్తి చేయకుండా కేవలం స్లాబ్ వరకు కూల్చి, అసంపూర్తిగా గోడలు వదిలేయడమే ఇందుకు కారణం గా మారాయని, ఇప్పటికైనా అధికారులు దృష్టి సారించి గోడలతో సహా పూర్తిగా నేలమట్టం చేసి శిథిలాలను తరలించాలని డిమాండ్ చేస్తున్నారు.కూల్చివేత ప్రక్రియ జరిగినప్పటినుంచి స్థానికంగా మున్సిపల్ అధికారులు,శానిటేషన్ సిబ్బంది ఇటు వైపు చూసిన పాపానపోలేదని ఆరోపిస్తున్నారు. శిథిలాల వద్ద డ్రైనేజీ, చెత్త చదారం పోగయ్యి మురికి కూపాలుగా మారి మరింత దుర్గంధం వెదజల్లుతున్నాయని స్థానికులు చెబుతున్నారు.దీనంతటికీ కారణమవుతున్న అసంపూర్తి కూల్చివేతలు పూర్తి చేసి ఈ దుర్గంధం, దుర్మార్గాల నుంచి విముక్తి చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
- Advertisement -