మిస్సింగ్ కేసులోని వ్యక్తి హత్య

- Advertisement -

మిస్సింగ్ కేసులోని వ్యక్తి హత్య

Murder of a missing person

తిరుపతి
మిస్సింగ్ అయిన వ్యక్తి హత్యకు గురయ్యాడు. ఏర్పేడు మండలం ,పల్లం గుంట పంచాయతీలోని ఓ కుంటలో ఘటన జరిగింది. అక్రమ సంబంధమే ప్రధాన కారణమని అనుమానిస్తున్నారు. మృతుడు శ్రీకాళహస్తి పట్టణానికి చెందిన ప్రభాకర్ గా గుర్తించారు. సుధా అనే మహిళ తన భర్త ప్రభాకర్ కనపడలేదని గత నెల 25న  శ్రీకాళహస్తి వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. పోలీసుల విచారణలో పల్లం గుంటకు చెందిన వెంకటేష్ భార్య వసంతతో ప్రభాకర్ కు వున్న అక్రమ సంబంధం పోలయీసులు గుర్తించారు. వెంకటేష్ అతని బంధువులు సుబ్రహ్మణ్యం హేమంత్ తో కలిసి హత్య చేసి సమీప ప్రాంతంలో పూడ్చివేసినట్టు పోలీసులు తేల్చారు. రెవెన్యూ అధికారుల సమక్షంలో మృతదేహాన్ని వెలికి తీసి పోస్టుమార్టం నిర్వహించారు. శ్రీకాళహస్తి వన్ టౌన్ సిఐ గోపి ఆధ్వర్యంలో హత్య కేసు విచారణ కొనసాగుతోంది. .

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular