- Advertisement -
మరోసారి పెద్ద ఎత్తున గంజాయి చాక్లెట్ గుట్టు రట్టు
Once again a large scale ganjai chocolate bunchహైదరాబాద్
సైబరాబాద్ ఎస్ ఓటి బాలానగర్ టీం మరోసారి గంజాయి చాక్లెట్ గుట్టు రట్టు చేసింది. విశ్వసనీయ సమాచారం మేరకు ఎస్ ఓ టి బాలానగర్ టీమ్, జగద్గిరి గుట్ట పోలీసులు సంయుక్తంగా జగత్గిరిగుట్ట రింగ్ బస్తీలో కిరాణా దుకాణంపై దాడి చేసి దుకాణం యజమాని బీహార్ కు చెందిన సునీల్ కుమార్ ఝా ను, అదుపులోకి తీసుకుని 61 ప్యాకెట్ల లో ఉన్న 2400 13 కేజీల, గంజాయి చాక్లెట్ల ను స్వాదీనం చేసుకున్నారు. పట్టుబడ్డ సునీల్ కుమార్ ఝా, 20 సంవత్సరాల క్రితం కూలీ పనుల కోసం బీహార్ నుండి వలస వచ్చినట్లు తెలుస్తుంది. గంజాయి చాక్లెట్ల ను బీహార్ నుండి తెస్తున్నట్లు తెలుస్తుంది. కొన్నేళ్ల క్రితం కిరాణా షాప్‌ని ప్రారంభించాడు. ఒక్కోచాక్లెట్ 40 లకు వలస కార్మికులకు అమ్ముతునట్లు తెలుస్తుంది. వీటి మొత్తం ధర రూ. 97,600 .
- Advertisement -




