- Advertisement -
కరీంనగర్ లో కాంగ్రెస్ ఆందోళన
Congress concern in Karimnagarఎమ్మెల్యే గంగుల కమలాకర్ దిష్టిబొమ్మ దగ్దం
అడ్డుకునేందుకు యత్నించిన పోలీసులు
పోలీసులకు కాంగ్రెస్ కార్యకర్తలకు మద్య తోపులాట
కానిస్టేబుల్ కు స్వల్ప గాయం
కరీంనగర్
కరీంనగర్ లో కాంగ్రెస్ ఆందోళన స్వల్ప ఉద్రిక్తతకు దారి తీసింది. ఎమ్మెల్యే గంగుల కమలాకర్, మంత్రి పొన్నం ప్రభాకర్ పట్ల అనుచిత వ్యాఖ్యలు చేశారని జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ కార్యకర్తలు నిరసన ఆందోళనకు దిగారు.
కరీంనగర్లో గంగుల దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. దిష్టిబొమ్మ దహనం చేయకుండా అడ్డుకునేందుకు పోలీసులు యత్నించగా పోలీసులకు కాంగ్రెస్ కార్యకర్తలకు మధ్య తోపులాట చోటు చేసుకుంది. తోపులాటలో కానిస్టేబుల్
కు స్వల్ప గాయమైంది. దిష్టిబొమ్మ చినిగి పోయింది. ముక్కలైన దిష్టిబొమ్మను దగ్దం చేశారు కాంగ్రెస్ కార్యకర్తలు. గంగులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పొన్నం ప్రభాకర్ పట్ల చేసిన అనుచిత వ్యాఖ్యలను వెనక్కి
తీసుకోవాలని డిమాండ్ చేశారు.
- Advertisement -



