- Advertisement -
నేత కార్మికుడి ఆత్మహత్య
Suicide of a weaverరాజన్న సిరిసిల్ల
కార్మిక క్షేత్రం రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో నేత కార్మికుడి ఆత్మహత్య కలకలం సృష్టిస్తుంది. గాంధీనగర్ లో నేత కార్మికుడు దూస గణేష్(45) ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఉపాధి లేక అప్పులు, ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్య చేసుకున్నట్లు సూసైడ్ నోట్ రాశాడు. ఐదు లక్షల వరకు అప్పు ఉందని సూసైడ్ నోట్ లో పేర్కొన్నాడు. పోలీసులకు అడ్రస్ చేస్తూ రాసిన సూసైడ్ నోట్ అప్పుల వివరాలు తెలుపుతూ ఉపాధి లేక ఆర్థిక ఇబ్బందులు తాళలేక అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్నట్లు రాశాడు. భార్య ఇద్దరు కూతుళ్లకు క్షమించాలని సూసైడ్ నోట్ లో కోరాడు.
- Advertisement -




