బంగారం వ్యాపారస్థులకు కుచ్చు టోపి
Gold is a hat for tradersపొరుమామిళ్ళ
గోల్డ్ షాప్ యజమాని మహబూబ్ బాషా, బంగారు వ్యాపారస్తులకు 60 లక్షలు కుచ్చు టోపీ పెట్టిన వైనం బయటపడింది. పోరుమామిళ్లలో పట్టణం లోని వసీం జ్యువెలర్స్ యజమాని మెహబూబ్ భాష తన భార్య హర్షత్
ఉన్నీషా 60 లక్షలు విలువచేసే వెండి బంగారు ప్రొద్దుటూరు, చాగలమర్రి, బద్వేల్ , మైదుకూరు, మరియు తదితర 12 మంది వద్ద బంగారు వెండి కొనుగోలు చేసి వ్యాపార
స్తులకు కుచ్చుటోపి పెట్టి పరారయ్యాడు. విషయం తెలుసుకున్న ప్రొద్దుటూరుకు చెందిన గోల్డ్ షాప్ యజమానులు పోరుమామిళ్ల పోలీస్ స్టేషన్లలో సబ్ ఇన్స్పెక్టర్ కొండారెడ్డికి ఫిర్యాదు చేశారు. ఆయన కథనం ప్రకారం
వివరాలు ఇలా ఉన్నాయి ప్రొద్దుటూరు కు చెందిన కొంతమంది వ్యాపారస్తులు దగ్గర గోల్డ్, వెండి తీసుకొని వచ్చి అమ్ముకొని ప్రతి నెల తిరిగి కొంత కొంత డబ్బు చెల్లించేవాడని నెల క్రితం ప్లాన్ ప్రకారం షాపు యజమాని
సుమారు 60 లక్షలు విలువచేసే బంగారుతో వెండితో పరారు కావడంతో ప్రొద్దుటూరుకి చెందిన గోల్డ్ యజమానులు పోరుమామిళ్ల పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చెయ్యగా సబ్ ఇన్స్పెక్టర్ కొండారెడ్డి కేసు నమోదు చేసి
దర్యాప్తు చేస్తున్నట్లు తెలియజేశారు.




