సమాఖ్య 2026 బిజినెస్ సమ్మిట్‌కు సీఎం రేవంత్‌రెడ్డికి ఆహ్వానం

- Advertisement -

సమాఖ్య 2026 బిజినెస్ సమ్మిట్‌కు సీఎం రేవంత్‌రెడ్డికి ఆహ్వానం

Invitation extended to CM Revanth Reddy for the Samakhya 2026 Business Summit.

Invitation extended to CM Revanth Reddy for the Samakhya 2026 Business Summit.
Invitation extended to CM Revanth Reddy for the Samakhya 2026 Business Summit.

హైదరాబాద్‌: ‘సమాఖ్య 2026 బిజినెస్‌ సమ్మిట్‌’కు హాజరుకావాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డిని నిర్వాహకులు ఆహ్వానించారు. అక్టోబర్‌ 14, 15 తేదీల్లో హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో సమాఖ్య 2026 బిజినెస్‌ సమ్మిట్‌ నిర్వహించనున్నట్లు తెలిపారు.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి, రాజ్యసభ సభ్యుడు వేమ్‌ నరేందర్‌రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి సమ్మిట్‌కు అధికారికంగా ఆహ్వానం అందజేశారు.

ప్రమోటర్లు టీవీఎన్‌ రావు, పీవీ రావు, జస్టిస్‌ జి. భవానీ ప్రసాద్‌, పోతురెడ్డి రమేష్‌, కె. శ్రీహరి, డా. పీఎల్‌ఎన్‌ పటేల్‌ తదితరులు సమ్మిట్‌ నిర్వహణకు సంబంధించిన వివరాలను ముఖ్యమంత్రికి వివరించారు. అలాగే ‘సమాఖ్య ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌’ గ్రాండ్‌ లాంచ్‌ కార్యక్రమం గురించి కూడా సీఎంకు వివరించి, కార్యక్రమానికి హాజరుకావాల్సిందిగా ఆహ్వానించారు.

ఈ భేటీలో ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌, మున్నూరు కాపు కార్పొరేషన్‌ చైర్మన్‌ బొమ్మ శ్రీరామ్‌ చక్రవర్తి, కరీంనగర్‌ లైబ్రరీ కమిటీ చైర్మన్‌ సత్తు మల్లేశ్‌ , ప్రమోటర్లు టీవీఎన్‌ రావు, పీవీ రావు, జస్టిస్‌ జి. భవానీ ప్రసాద్‌, పోతురెడ్డి రమేష్‌, కె. శ్రీహరి, డా. పీఎల్‌ఎన్‌ పటేల్‌ తదితరులు కూడా ఈ సందర్భంగా పాల్గొన్నారు.

అక్టోబర్‌ 14–15 తేదీల్లో హైటెక్స్‌లో జరగనున్న ఈ బిజినెస్‌ సమ్మిట్‌లో వ్యాపార, పారిశ్రామిక రంగాలకు సంబంధించిన పలు అంశాలపై చర్చలు జరగనున్నాయి.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular