కూటమి పాలనలో రైతుకి పారిశ్రామికవేత్తలతో సమంగా ప్రాధాన్యం
Farmers are given equal priority with industrialists under the alliance regimeప్రతి అడుగులో సింగిల్ విండో తరహా విధానాలు అమలు
24 గంటల్లో రూ. 33 కోట్ల రవాణా, గోతాముల బకాయిల విడుదల
క్వింటాలుకు రూ. 2350 కనీస మద్దతు ధర చెల్లింపు
180 రోజుల ప్రణాళికలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా 10 వేల కొత్త రేషన్ షాపులు
ఆరు నెలల్లో రేషన్ బియ్యం నాణ్యత పెంపు
గత ప్రభుత్వ పాలనలో ప్రతి అడుగులో స్కాములే
బద్వేలు నియోజకవర్గ కూటమి నాయకులు మంచూరు సూర్యనారాయణ రెడ్డి బోవిల్ల నందగోపాల్ రెడ్డి గుర్రంపాటి వెంగళరెడ్డి
బద్వేలు ఉదయం ప్రతినిధి
కూటమి ప్రభుత్వంలో రైతుకు పారిశ్రామికవేత్తలతో సమంగా ప్రాధాన్యత ఇస్తామని, ప్రతి అడుగులో ఎర్రతివాచీ పరచి రైతుకి ఎక్కడా ఇబ్బంది కలుగకుండా జాగ్రత్తలు తీసుకుంటామని బద్వేలు నియోజకవర్గ కూటమి నాయకులు ప్రముఖ రైల్వే కాంట్రాక్టర్లు
మంచూరు సూర్యనారాయణ రెడ్డి బోవిల్లా నందగోపాల్ రెడ్డి గుర్రంపాటి వెంగళరెడ్డి తెలిపారు
విత్తనాల కొనుగోలు నుంచి ధాన్యం అమ్ముకునే వరకు సింగిల్ విండో తరహా విధానాలు అమలు చేస్తామని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆలోచనలకు అనుగుణంగా వ్యవసాయ రంగ పటిష్టతకు ప్రత్యేక పథకాలు అమలు చేస్తామన్నారు. ధాన్యం కొనుగోలు చేసిన 48 గంటల్లో సొమ్ము రైతు అకౌంట్ లో వేసే ఏర్పాటు చేస్తామని తెలిపారు. 100 రోజుల ప్రణాళికలో భాగంగా పౌరసరఫరాల శాఖ బకాయిల్లో రూ. 10 వేల కోట్లు తిరిగి చెల్లించడంతో పాటు 10 వేల కొత్త రేషన్ షాపులు ప్రారంభిస్తామని పేర్కొన్నారు. ఫెయిర్ ప్రైస్ షాపులు తీసుకువచ్చి బియ్యం, కందిపప్పుతోపాటు చక్కెర, పామ్ ఆయిల్ ఇతర నిత్యావసరాలు అందచేసే ఏర్పాటు చేస్తున్నామన్నారు. త్వరలో బియ్యం నాణ్యత పెంచే విధంగా చర్యలు తీసుకోనున్నట్టు తెలిపారు. కూటమి ప్రభుత్వం ప్రతి పని ప్రజల పక్షాన నిలబడే విధంగా ముందుకు వెళ్తోందన్నారు. “ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ అనేక సందర్భాల్లో చెప్పిన మాటలు అధికారంలోకి వచ్చిన తర్వాత తు.చ. తప్పకుండా ముందుకు తీసుకువెళ్తున్నాం. ప్రజల పక్షాన నిలబడి నిస్వార్ధంగా సేవలు అందిస్తున్నాం. . గ్రామాల్లో 80 శాతం మంది కౌలు రైతులు ఉంటే, గత ప్రభుత్వ హాయంలో ఐదేళ్లలో వారి గురించి పట్టించుకున్న నాథుడు లేకపోయాడు. కౌలు రైతుల కృషిని ప్రభుత్వం పూర్తిగా విస్మరించింది. వారు ఆత్మహత్యలకు పాల్పడినప్పుడు ఒక్కొక్కరు రూ. 17 లక్షల వరకు అప్పులు చేస్తే, లక్షా, లక్షా 20 వేలుగా చిత్రించారు. కౌలు రైతు గుర్తింపు నిబంధనలు మార్చేసి సీసీఆర్సీ కార్డులు కూడా ఇవ్వకుండా చేసింది.
కౌలు రైతులకు అన్యాయం చేసిన గత పాలకులు
గ్రామ సభలో కౌలు రైతుని గుర్తించే విధంగా తీర్మానం చేసి రైతుతో సమంగా పథకాలు అందే విధంగా చట్టం ఉంటే, జగన్ అధికారంలోకి వచ్చాక 11 నెలల రెంటల్ అగ్రిమెంటులు కావాలని, భూస్వామి సంతకం కావాలని ఇష్టం వచ్చిన నిబంధనలు తీసుకువచ్చింది. కౌలు రైతుని దీనస్థితికి నెట్టింది. కూటమి ప్రభుత్వంలో కౌలు రైతుకి అండగా నిలబడే విధంగా ప్రత్యేక చర్యలు తీసుకుంటాం. రెవెన్యూ సదస్సులు పెట్టి ప్రతి కౌలు రైతుకీ సీసీఎల్సీ కార్డులు అందచేసే బాధ్యత అధికారులు తీసుకోవాలి. కూటమి ప్రభుత్వం ప్రతి అడుగులో రైతాంగానికి బాసటగా నిలుస్తుంది.
84 వేల మంది రైతులకిచ్చిన మాట వైసీపీ ప్రభుత్వం తప్పింది
గత ప్రభుత్వ విధ్వంసాలు ప్రస్తావించుకుంటే మంత్రులు ప్రెస్ మీట్లు పెట్టి చంద్రబాబు పవన్ కళ్యాణ్ తిట్టడం మినహా చేసిందేమీ లేదు. ప్రభుత్వంలోకి వచ్చాక రైతు బకాయిల మీద సమీక్ష జరిపితే పౌరసరఫరాల శాఖ ద్వారా రూ. 40 వేల కోట్ల రుణాలు సేకరించి ఇతర కార్యక్రమాలకు వాడేసిన విషయం బయటపడింది. అందులో ఒక్క రూపాయి కూడా రైతు శ్రేయస్సు కోసమో, ధాన్యం కొనుగోళ్ల కోసమే వాడింది లేదు. వెళ్తూ వెళ్తూ రైతుల నుంచి ధాన్యం కొన్న బకాయిలు రూ.1674 కోట్లు వదిలేసిపోయారు. గత ప్రభుత్వం 84 వేల మంది రైతులకు ఇచ్చిన మాట తప్పింది. ఆ పరిస్థితుల్లో ఆర్ధిక ఇబ్బందులు ఉన్నా బకాయిలు నెల రోజుల లోపు చెల్లించే ప్రయత్నం చేశాం. ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు కూడా రైతులకు ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. దీంతో జులై 4వ తేదీన రూ. వెయ్యి కోట్లు, ఈ రోజు మిగిలిన రూ. 674 కోట్లు చెల్లించాము.
రాష్ట్రంలో ఎక్కువ మందికి వ్యవసాయ రంగమే ఉపాధి కల్పిస్తోంది. దానికి ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉంది. అందుకే కూటమి ప్రభుత్వం ఆ రంగానికి పెద్దపీట వేసి ముందుకు తీసుకువెళ్తోంది.




