- Advertisement -
జీహెచ్ ఎంసి పరిధిలోకి పట్టణ లక్షణాలున్న గ్రామాలు
Villages with urban characteristics under GHMC
మంత్రి పొన్నం ప్రభాకర్
హైదరాబాద్
హైదరాబాద్ సమీపంలోని ఓఆర్ఆర్ పరిధిలో ఉన్న 51 గ్రామ పంచాయతీ లలో పట్టణ ప్రాంతాలకు దగ్గరగా ఉండి పట్టణ లక్షణాలు ఉన్న గ్రామాలు సమీపంలో ఉన్న మున్సిపల్ లో విలీనం చేయడం జరుగుతుందని
మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. రాష్ట్రంలో పట్టణ ప్రాంతాల్లో 80 గ్రామ పంచాయతీ లు మున్సిపాలిటీ లు గా ,మున్సిపల్ కార్పొరేషన్ లుగా మార్చడం జరుగుతుంది.. సుప్రింకోర్టు ఆదేశాల మేరకు పంచాయతీ రాజ్
ఎన్నికలు జరపడానికి డెడికేటెడ్ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. రాష్ట్ర ఎన్నికల సంఘం ట్రిబ్యునల్ సవరణ మేరకు పంచాయతీ రాజ్ చట్టం షెడ్యూల్ 8 లోనీ 140 పంచాయతీల సవరణ చేయడం జరిగిందని అన్నారు.
- Advertisement -