పుష్ప సినిమా వివాదం పై మంత్రి సీతక్క సంచలన వ్యాఖ్యలు

- Advertisement -

పుష్ప సినిమా వివాదం పై మంత్రి సీతక్క సంచలన వ్యాఖ్యలు

Minister Seethakka's sensational comments on Pushpa movie controversy

జై బీమ్ లాంటి సందేశాత్మక సినిమాలకు అవార్డులు రాలేదు
ములుగు
జై బీమ్ లాంటి సందేశాత్మక సినిమాలకు అవార్డులు రాలేదు. అలాంటి సినిమాలకు ప్రోత్సాహాలు లేవని మంత్రి సీతక్క అన్నారు. కానీ ఒక స్మగ్లర్ పోలీస్ బట్టలు విప్పి నిలబెట్టి.. పోలీస్ స్టేషన్ కొన్న సినిమాలకు కేంద్ర ప్రభుత్వం అవార్డులు ఇవ్వడం దేనికి సంకేతం. స్మగ్లర్ హీరో అంటే అదేం సినిమా…? స్మగ్లర్ హీరో.. స్మగ్లింగ్ కట్టడి చేసే పోలీస్ విలన్ ఎలా అవుతాడు..? సందేశాత్మక సినిమాలు తీస్తే ప్రజలు స్వాగతిస్తారని అన్నారు.
రెండు మర్దర్లు చేసిన నేరస్తుడు మహారాష్ట్రలో పుష్ప 2 సినిమా చూస్తూ దొరికాడు. ఇలాంటి సినిమాలు నేర ప్రవృత్తిని పెంచేలా ఉన్నాయి.. మానవతా దృక్పథం ఉన్న సినిమాలు రావాలి. కేంద్ర ప్రభుత్వం ఎలాంటి సినిమాలకు ప్రోత్సాహం అందిoచాలి.. చంకలో బిడ్డపెట్టుకుని ఒక పేద మహిళపై హక్కులు కోసం పోరాడిన జై బీమ్ సినిమాకు అవార్డు రాలేదు. సినిమాలను గౌరవిస్తాం. హక్కులు కాపాడే లాయర్ జీరో…స్మగ్లర్ హిరో ఎలా అవుతాడని అన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular